కాంగ్రెస్‌కు ‘మోదీ’ ప్రచారం

11 Nov, 2018 05:02 IST|Sakshi

రాయ్‌పూర్‌: ప్రధాని మోదీ వేషధారణలో ఉన్న ఈ వ్యక్తి పేరు అభినందన్‌ పాఠక్‌. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈయన గతంలో ఎన్డీయే భాగస్వామ్య రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో ఉండేవారు. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలు అమలవ్వక పోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో చేరి వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లో ప్రచారానికి వెళ్లినప్పుడు పాఠక్‌తో ఇలా ఫొటో తీసుకుని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ ఫొటోకు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ప్రచారం వచ్చింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు