300 మంది చనిపోయారా? లేక చెట్లు కూలాయా?

4 Mar, 2019 13:23 IST|Sakshi

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) జరిపిన దాడుల్లో నిజంగానే 300 మంది ఉగ్రవాదులు చనిపోయారా అంటూ ప్రతిపక్షాలు ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. భద్రతా దళాల ధైర్యసాహసాలను రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నాయని,  ఆర్మీ దాడులను రాజకీయం చేస్తున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రతిపక్షాలకు తాజాగా పంజాబ్‌ మంత్రి, కాంగ్రెస్‌ నేత, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ గొంతు కలిపారు. విదేశీ శత్రు దేశంతో పోరాడుతున్నామంటూ దేశంలోని ప్రజలను మోసం చేస్తున్నారని, నిజానికి మీరు ఉగ్రవాదులను చంపారా? లేక చెట్లను కూల్చారా? ఇదంతా ఎన్నికల గిమ్మిక్కేనా అని సిద్ధూ ప్రశ్నించారు. 

‘300 మంది ఉగ్రవాదులు నిజంగా చనిపోయారా? లేదా? మీ ఉద్దేశం ఏమిటి? ఉగ్రవాదులను నేలమట్టం చేయడమా? చెట్లను కూల్చడమా? ఇది ఎన్నికల గిమ్మిక్కా? శత్రుదేశంతో పోరాడుతున్నామంటూ.. దేశాన్ని మోసం చేస్తున్నారు. ఆర్మీతో రాజకీయం చేయడం మానండి. ఆర్మీ దేశమంతా పవిత్రమైనది’ అని సిద్ధూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు