ఒడిశా సీఎం సంచలన నిర్ణయం

10 Mar, 2019 14:38 IST|Sakshi

భువనేశ్వర్‌: సార్వత్రిక ఎన్నికల ముందు ఒడిశా ముఖ్యమంత్రి, బీజూజనతాదళ్‌ (బీజేడీ) అధినేత నవీన్‌ పట్నాయక్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల టికెట్ల కేటాయింపులో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం కెండార్పర ఎన్నికల సభలో పాల్గొన్న నవీన్  పట్నాయక్‌  ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. దీంతో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. దీంతో 33శాతం ఎంపీ టికెట్లను​ మహిళకే కేటాయించనున్నారు.

ఒడిశాలోని 21 లోక్‌సభ స్థానాల్లో ఏడు లేదా ఎనిమిది స్థానాలు మహిళలకు దక్కనున్నాయి. కాగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌ దేశ వ్యాప్తంగా దశాబ్దాలుగా వినిపిస్తో‍న్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లు ప్రస్తుతం పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా నవీన్‌ పట్నాయక్‌ తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. లోక్‌సభతో పాటు ఒడిశా అసెంబ్లీ కూడా ఎన్నికలు జరుగనున్నాయి.
 

మరిన్ని వార్తలు