మళ్లీ తెరపైకి ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం

14 Apr, 2018 12:34 IST|Sakshi
ఆప్‌ ఎమ్మెల్యేలతో సీఎం కేజ్రీవాల్‌

సాక్షి, న్యూఢిల్లీ : కోర్టు తీర్పుతో ఊరట పొందిన ఆప్‌ ఎ‍మ్మెల్యేలను ఎన్నికల సంఘం మాత్రం వదలట్లేదు. శుక్రవారం 20 మంది ఆప్‌ ఎమ్మెల్యేలకు ఎన్నికల సంఘం ప్యానెల్‌ నోటీసులు జారీ చేసింది. మే 17న వీరందరినీ తమ ఎదుట హాజరై వాదనలు వినిపించాలని కోరింది. కోర్టు ఆదేశాల మేరకే తాము ఈ చర్యలకు దిగినట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్‌, కమిషనర్లు సునీల్‌ అరోరా, అశోఖ్‌ లవసలు ఎమ్మెల్యేల వాదనలను వింటారని ఈసీ పేర్కొంది.

ఇదిలా ఉంటే అనర్హత వేటు కేసులో వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు ఊరట ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం వేసిన అనర్హత వేటును హైకోర్టు పక్కన పెడుతూ.. ఎన్నికల సంఘం తమ నిర్ణయాన్ని మళ్లీ పరిశీలించాలని, ఆ ఎమ్మెల్యేల వాదనలు వినాలని 79 పేజీలతో కూడిన తీర్పు కాపీలో ఆదేశించింది. దీంతో వాదనలు వినేందుకు ఎన్నికల సంఘం ఇప్పుడు నోటీసులు జారీ చేసింది. 

2015 లో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమ్‌ ఆద్మీ సర్కార్‌… పార్లమెంటరీ కార్యదర్శులుగా 20 మంది ఎమ్మెల్యేలను నియమించింది. ఇవి లాభదాయక పదవుల కిందకు వస్తాయని… ఈ కారణంగా వారిపై అనర్హత వేటు వేస్తున్నట్లు ఈసీ వాదిస్తూ వస్తోంది.

ఆప్‌ ఎమ్మెల్యేల వేటుపై సవాలక్ష ప్రశ్నలు

మరిన్ని వార్తలు