సెటిల్మెంట్లకు అడ్డాగా మంత్రుల పేషీలు

17 Jul, 2018 01:28 IST|Sakshi

బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంత్రుల, ఎమ్మెల్యేల పేషీలు భూముల పంచాయితీలకు, సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయని బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి సోమ వారం ఆరోపించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యవహారం కొత్తగా తెరపైకి రావడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధుల వ్యవహారశైలికి నిదర్శనమన్నారు. గతంలో ప్రజలకు రౌడీలు, గూం డాల నుంచి బెదిరింపులుండేవని, టీఆర్‌ఎ స్‌ అధికారంలోకి వచ్చాక మంత్రుల నుంచే నేరుగా బెదిరింపులు వస్తున్నాయన్నారు.

మంత్రులు పద్మారావు, జూపల్లి, ఎమ్మెల్యే లు గువ్వల బాలరాజు, దుర్గం చిన్నయ్య వంటివారి బెదిరింపులు వెలుగులోకి వచ్చాయన్నా రు. నిజామాబాద్‌ జిల్లాలో దళితుల భూమి కబ్జా చేశారని ఆరోపణలు వస్తే సీఎం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం చూసీచూడనట్టుగా వ్యవహరించడం వల్లే అధికారపార్టీ నేతలు బరితెగించారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు