‘స్థానిక’ ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ కీలక నిర్ణయం

11 Mar, 2020 13:42 IST|Sakshi

సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులను స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో నిలపవద్దని వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఆదేశించింది. ఎవరైనా పోటీలో నిలిపితే వారికి బీఫామ్‌లు ఇవ్వకూడదని రీజినల్‌ కోఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. 
(చదవండి : నామినేషన్లను అడ్డుకుంటే చర్యలు తప్పవు')

కాగా, నేటితో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రకియ ముగియనుంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 660 జడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రేపు నామినేషన్లను పరిశీలించనునాన్నరు. ఈనెల 14న తుది జాబితాను ప్రకటించి, 21న ఎన్నికల నిర్వహించనున్నారు. ఫలితాలను మార్చి 24న ప్రకటించనున్నారు. మరోవైపు మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 13 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మార్చి 23న ఎన్నికల పోలింగ్‌ నిర్వహించి.. 27న ఫలితాలను ప్రకటిస్తారు. 

మరిన్ని వార్తలు