ఎన్నార్సీ ఓకే.. పండిట్ల సంగతేంటి?

4 Aug, 2018 09:52 IST|Sakshi
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే

ముంబై: కేంద్ర పౌర జాబితా(ఎన్నార్సీ) విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని శివసేన సమర్థించింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో తమ మద్దతుంటుందని తెలిపింది. ప్రభుత్వాన్ని అభినందించింది. దేశంలో అక్రమంగా ఉండే పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు, శ్రీలంకన్లు, రోహింగ్యా ముస్లింలు ఎవరైనా వారిని బహిష్కరించాలని కోరింది. అయితే.. కశ్మీర్‌లోకి పండిట్ల ‘ఘర్‌ వాపసీ’ చేసే విషయంలో కేంద్రానికి ధైర్యముందా అని పార్టీ పత్రిక సామ్నాలో ప్రశ్నించింది.

ఉగ్రవాదం కారణంగా కశ్మీర్‌ నుంచి హిందువులను (పండిట్లను) బలవంతంగా పంపేసిన విషయాన్ని మరిచిపోవద్దని సూచించింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. అసోంలో ప్రకటించినట్టుగా కశ్మీర్‌లోనూ కేంద్ర పౌర జాబితా ప్రకటించాలని కోరింది. దేశంలోని ప్రతి ఇంటిపై హిందుత్వ జెండా ఎగరవేయాలని ఆకాంక్షించింది.

మరిన్ని వార్తలు