ఆ రోజు దగ్గరలోనే ఉంది - ఉద్ధవ్ ఠాక్రే 

28 Sep, 2019 17:07 IST|Sakshi

ముంబై: అక్టోబర్ 21న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసే అంశంపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టత ఇచ్చారు. రాబోయే ఒకటి, రెండు రోజుల్లో శివసేన, భారతీయ జనతా పార్టీ సీట్ల భాగస్వామ్య ఏర్పాట్లను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. పొత్తుపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్నఅంశంపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. బీజేపీ జాతీయ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో ఇరు పార్టీల మధ్య సీట్ల భాగస్వామ్య ఒప్పందంపై తుది చర్చలు జరుగుతున్నాయని, కొన్ని సీట్లపై కూటమిలోని పార్టీలు ఒక అవగాహనకు రావాల్సి ఉందని ముంబైలోని పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో తెలియజేశారు. అదే సందర్భంలో తాను తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే రోజు కూడా ఎంతో దూరంలో లేదన్నారు. ఎన్‌డీఏ-శివసేన కూటమి అధికారంలోకి రాగానే సీఎం పదవిని చెరో రెండున్నర సంవత్సరాలు బీజేపీ, శివసేన పంచుకునే అవకాశాలున్నాయని ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో ఉద్ధవ్ ఠాక్రే చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా