ఆస్తులు రూ.2.71కోట్లు.. అప్పులు రూ.1.44కోట్లు

9 Nov, 2023 07:14 IST|Sakshi

ఇబ్రహీంపట్నం: 2.71 కోట్ల విలువైన ఆస్తులు, వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఎనిమిది కేసులున్నట్లు బీజేపీ ఇబ్రహీంపట్నం అభ్యర్థి నోముల దయానంద్‌ గౌడ్‌ ఎలక్షన్‌ అఫిడవిట్లో పేర్కొన్నారు.

ఆస్తులు
చేతిలో రూ.35వేల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.లక్ష, రూ.36లక్షలు విలువ చేసే ఫార్‌ూచ్యనర్‌, రూ.30లక్షల విలువైన బెంజ్‌ కార్లు, 12 తులాల బంగారం, ఇంజాపూర్‌లో రెండు ప్లాట్లు, తుమ్మలూరు పరిధిలో రూ.2కోట్ల విలువ చేసే 6570 చదరపు అడుగుల్లో రెసిడెన్షియల్‌ విల్లాతో కలిపి రూ.2,71,40,000 ఆస్తులను చూపగా రూ.1,44,22,308 అప్పులున్నట్లు పేర్కొన్నారు.

సతీమణి జయలక్ష్మి పేరిట
చేతిలో రూ.21 నగదు, బ్యాంకు ఖాతాలో రూ.5వేలు, 21 తులాల బంగారం, మొత్తం ఆస్తులు రూ.15,06,122

పెద్ద కుమారుడు కార్తీక్‌ కుమార్‌ పేరిట
పెద్ద కుమారుడు కార్తీక్‌కుమార్‌ చేతిలో నగదు రూ.8వేలు, బ్యాంకు ఖాతాలో రూ.30వేలు, ఒక బైక్‌, 5 తులాల బంగారం, మొత్తం ఆస్తులు రూ.4,45,810

చిన్న కుమారుడు భరత్‌కుమార్‌ పేరుతో..
చిన్న కుమారుడు భరత్‌కుమార్‌ చేతిలో రూ.8 వేలు, బ్యాంకు ఖాతాలో రూ.20 వేలు, రూ.20లక్షలు విలువచేసే 2011 మోడల్‌ ఆడి, రూ.14 లక్షలు విలువచేసే 2012 మోడల్‌ ఇన్నోవా కార్లు, 4 తులాల బంగారం, మొత్తం ఆస్తులు రూ. 37,09,928 ఉన్నాయి. వాహనాల లోన్స్‌తోపాటు ఇతర అప్పులు మొత్తం రూ.60,34,964 ఉన్నట్లు చూపారు.

మరిన్ని వార్తలు