బీజేపీలోకి ప్రముఖ సింగర్‌ దలేర్‌ మెహందీ

27 Apr, 2019 04:07 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ పంజాబీ సింగర్‌ దలేర్‌ మెహందీ శుక్రవారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వాయవ్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న హన్స్‌రాజ్‌ హన్స్‌తదితరులు పాల్గొన్నారు. హన్స్‌రాజ్‌ కుమారుడితో మెహందీ కుమార్తె వివాహం జరిగిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు