ప్రచారం కోసమే కాంగ్రెస్‌ చలో అసెంబ్లీ

27 Oct, 2017 01:27 IST|Sakshi

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ధ్వజం  

సాక్షి, హైదరాబాద్‌: వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్‌.. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియక అయోమయంలో పడిందని, అందుకే చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. కేవలం ప్రచారం కోసమే చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిందని ధ్వజమెత్తారు.

గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సభలో ప్రతిపక్షం ఏం మాట్లాడినా వినాలని, ఆ తర్వాతే సమాధానం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ సూచించారని చెప్పారు. తామంతా అర్థవంతమైన చర్చ కోసం ఎదురు చూస్తుంటే.. తొలిరోజే చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం ఏమిటని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తున్నారని జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క పనికిమాలిన మాటలు మాట్లాడు తున్నారని మండిపడ్డారు. సీఎల్పీ నేత జానారెడ్డి బాధ్యతతో చలో అసెంబ్లీని ఉపసంహరించుకోవాలని సూచించారు. గొర్రెల రీసైక్లింగ్‌లో ఎవరినీ వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని తలసాని హెచ్చరించారు.  

>
మరిన్ని వార్తలు