‘మూడు’ ముగిసింది!

3 May, 2019 06:56 IST|Sakshi
రఘునాథపాలెం టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీ అభ్యర్థి ప్రియాంక నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అజయ్, నామా

సాక్షిప్రతినిధి, ఖమ్మం: మూడో దశ జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఏడు జెడ్పీటీసీ, 92 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా.. భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు గురువారం చివరిరోజు కావడంతో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా పోటీ చేసే వివిధ పార్టీల అభ్యర్థులతో మండల పరిషత్‌ కార్యాలయాలు కోలాహలంగా మారాయి. 7 జెడ్పీటీసీ స్థానాలకు 79 నామినేషన్లు, 92 ఎంపీటీసీ స్థానాలకు 606 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల నుంచి ఎక్కువగా నామినేషన్లు దాఖలు కాగా.. సీపీఎం, సీపీఐ, బీజేపీ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీలు ఆయా ప్రాంతాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు పోటాపోటీగా నామినేషన్లు వేశాయి.

జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు ఇలా..  
7 జెడ్పీటీసీ స్థానాలకు 79 నామినేషన్లు దాఖలు కాగా.. వాటిలో బీజేపీ నుంచి 5, సీపీఐ 1, సీపీఎం 2, కాంగ్రెస్‌  21, టీఆర్‌ఎస్‌ 35, టీడీపీ 5, గుర్తింపు పొందిన పార్టీల నుంచి 3, స్వతంత్రులు ఏడుగురు నామినేషన్లు వేశారు. అలాగే 92 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి 22, సీపీఐ 32, సీపీఎం 45, కాంగ్రెస్‌ 157, టీఆర్‌ఎస్‌ 267, టీడీపీ 28, గుర్తింపు పొందిన పార్టీల నుంచి 5, స్వతంత్రులు 50 మంది నామినేషన్లు వేశారు.

మరిన్ని వార్తలు