‘గాడ్సేపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకోను’

17 May, 2019 11:57 IST|Sakshi

సాక్షి, చెన్నై: గాడ్సేపై తాను  చేసిన వ్యాఖ్యలు వివాదం కాలేదని, హిందూ సంఘాలే వాటిని వివాదంగా మార్చాయని ఎంఎన్ఎం, అధ్యక్షుడు కమల్ హాసన్ అన్నారు. గాడ్సేపై తాను చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయం తనకు లేదని, తనని అరెస్ట్ చేస్తే పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటాయని కమల్‌ స్పష్టం చేశారు. అరెస్ట్ చేయకపోవడం వారికే మంచిదన్నారు. అతివాదం అనేది ప్రతి మతంలో ఉంటుందని, ఈ విషయంలో చరిత్రే స్పష్టంగా చెబుతోందని పేర్కొన్నారు.

ప్రచారంలో భాగంగా కమల్‌హాసన్‌ మధురైలో మీడియాతో మాట్లాడారు. ఏ మతాన్ని కించపరచడం తన ఉద్దేశ్యం కాదని, తాను ఎవరికీ బయపడేదిలేదన్నారు. కాగా స్వతంత్ర భారతదేశంలో తొలి హిందూ ఉగ్రవాది మహాత్మ గాంధీని హత్య చేసిన నాథూరం గాడ్సే అంటూ కమల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్నే స్పష్టించాయి. కాగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కమల్‌ నాలుకను కట్‌ చేయాలంటూ తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ తీవ్రం స్థాయిలో మండిపడ్డారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

మరిన్ని వార్తలు