ప్రజాసంకల్పయాత్రకు బ్రహ్మరథం

19 Nov, 2017 14:09 IST|Sakshi

సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. అన్నవస్తున్నాడంటూ జేజేలు చెబుతున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 12వ రోజు ఆదివారం కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు. సౌదరదిన్నె నుంచి ఈ ఉదయం యాత్ర కొనసాగించిన రాజన్న తనయుడి కోసం జనం భారీగా తరలివచ్చారు. ఆమదాల క్రాస్‌ రోడ్డు, గులాంనబీ పేట-బొందల దిన్నెక్రాస్‌ రోడ్డు, ఎల్లురి కొత్తపేట మీదుగా పాదయాత్ర కొనసాగుతోంది. దారి పొడవునా ప్రజల సమస్యలు వింటూ, అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు.

టీచర్లు, 108, 104 ఉద్యోగులు వైఎస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని అభ్యర్థించారు. తన వంతు ప్రయత్నం చేస్తానని జగన్‌ వారికి హామీయిచ్చారు. వృద్ధులు, దివ్యాంగులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు పరిష్కరిస్తానని జననేత హామీయివ్వడంతో వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆలిండియా బంజారా సేవా సంఘం ప్రతినిధులు.. వైఎస్‌ జగన్‌ను కలిసి వాపోయారు. గిరిపుత్రిక పథకం కింద వివాహాలకు రూ.50 వేలు ఇస్తామని మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక గిరిజనులకు న్యాయం చేస్తామని జగన్‌ మాట ఇచ్చారు.

మరిన్ని వార్తలు