​కార్పొరేషన్‌లో అభివృద్ధి జరగలేదు: పోశెట్టి

9 Jan, 2020 13:02 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: జిల్లా ​కార్పొరేషన్‌లో సరైన అభివృద్ధి జరగలేదని టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఏఎస్‌ పోశెట్టి నిరసన వ్యక్తం చేశారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడతూ.. రోడ్లు, డ్రైనేజ్‌ వ్యవస్థ అసలు బాగోలేదని, ప్రభుత్వం ఏటా నిజామాబాద్‌కు విడుదల చేస్తున్నా రూ. 100 కోట్లను ఏం చేస్తున్నారని  ధ్వజమేత్తారు. రోడ్ల విస్తరణ లేకపోవడం వల్ల ట్రాఫిక్‌ సమస్యలు తీవ్రం అవుతున్నాయని, కాలనీల్లో అభివృద్ధి అనేది ఎక్కడా కూడా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోయిందని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నగరంలో సరైన ఆట స్థలాలు పార్కులు, పార్కింగ్‌ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అవినీతి పరులకు ఓటు వేయకుండా ప్రజల కోసం పోరాడే అభ్యర్థులకు, పని చేసే యువకులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు