ఐటీగ్రిడ్స్‌ కేస్‌ : లుక్‌అవుట్‌ నోటీసు జారీ

6 Mar, 2019 10:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డేటా చోరి వ్యవహారంలో ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ ఛైర్మన్‌ అశోక్‌పై సైబరాబాద్‌ పోలీసులు బుధవారం లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. అశోక్‌ దేశం విడిచి పారిపోకుండా అన్ని విమానాశ్రయాలను అలెర్ట్‌ చేశారు. ఈ కేసువ్యవహారంలో పోలీసులు మొదటిసారి ఎథికల్‌ హ్యాకర్ల సహాయం తీసుకుంటున్నారు. ప్రధానంగా లాక్‌ చేసిన అత్యాధునిక కంప్యూటర్లలో ఉన్న డేటాను స్వాధీనం చేసుకోవడానికి ఎథికల్‌ హ్యాకర్లతో ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పాస్‌వర్డ్‌ ప్రొటెక్టివ్‌గా ఉన్న ఆ కంప్యూటర్లను ఓపెన్‌ చేసిన ఎథికల్‌ హ్యాకర్లు వాటి నుంచి 40 జీబీ ప్రాసెస్డ్‌ డేటా ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఏపీలో జరిగిన గత ఉప ఎన్నికల్లో సేవామిత్ర యాప్‌ను ట్రయల్‌ రన్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్‌ ఇండియా కంపెనీ... టీడీపీకి చెందిన అధికారక ‘సేవామిత్ర’ యాప్‌ను రూపొందించింది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రజల ఓటర్ల ఆధార్‌ డాటాతో పాటు వ్యక్తిగత వివరాలును ఐటీ గ్రిడ్స్‌ యధేచ్ఛగా వాడుకుంది. దీంతో ఐటీ గ్రిడ్‌ కంపెనీ డాటా కుంభకోణంపై వైఎస్సార్ సీపీ నేత లోకేశ్వర్‌ రెడ్డి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పలు సెక్షన‍్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరపగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

చదవండి : అశోక్‌ ఐఫోనే అత్యంత కీలకం

మరిన్ని వార్తలు