'కేసీఆర్ మోసం చేస్తున్నారు'

28 May, 2020 14:18 IST|Sakshi

తెలంగాణ‌లో త‌క్కువగా క‌రోనా టెస్టులు

వ‌ల‌స కార్మికులకు రూ.19 వేలు ఇవ్వాల‌ని డిమాండ్‌

గాంధీభ‌వ‌న్‌లో స‌మావేశ‌మైన టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: క‌రోనా వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న పేద ప్ర‌జ‌ల‌ను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోవ‌డం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ ‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. వ‌ల‌స కార్మికుల‌కు, నిరుపేద‌ల‌కు ఆహారం, ఆశ్రయం, భ‌ద్ర‌త, స‌రైన రవాణా సదుపాయం కల్పించలేకపోయాయని ఎద్దేవా చేశారు. గురువారం ఆయ‌న గాంధీభవన్‌లో వలస కార్మికులతో ముచ్చ‌టించారు. లాక్ డౌన్ వ‌ల్ల ఏర్ప‌డిన సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వలస కార్మికులకు తక్షణమే రూ.10 వేలు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. (రైతుబంధు ఎగ్గొట్టేందుకు కుట్ర)

టెస్టులు ఎందుకు చేయ‌డం లేదు?
అనంత‌రం ఉత్తమ్‌కుమార్ ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల‌ను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌భుత్వం క‌రోనా ప‌రీక్ష‌లు స‌రిగా చేయ‌డం లేద‌ని, దేశంలో అత్యంత త‌క్కువ టెస్టులు తెలంగాణ‌లోనే జ‌రిగాయ‌ని పేర్కొన్నారు. మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రోజుకు 5 వేల టెస్టులు చేస్తామ‌ని చెప్పారని, మ‌రిప్పుడెందుకు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. టెస్టులు చేయాల‌ని హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయ‌లు వేసినా ప్ర‌భుత్వానికి సోయి రావ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

కార్మికుల కోసం బ‌స్సు ఏర్పాటు చేసిన బ‌స్సు
అటు ధాన్యం కొనుగోలులో కూడా ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందన్నారు. కోటి ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు కొంటామ‌ని చెప్పి, ఇప్పుడు 50 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు కొన్నార‌ని తెలిపారు. పైగా కొన్ని ర‌కాల విత్త‌నాలు అమ్మాల‌ని, మ‌రికొన్ని విత్త‌నాలు అమ్మవద్ద‌ని ఆదేశాలిచ్చార‌ని.. దీంతో రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. అటు ఉపాధిహామీ ప‌థ‌కంలో స‌రిగా ప‌ని క‌ల్పించ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాగా హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఒరిస్సా కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ బ‌స్సు ఏర్పాటు చేసింది. ఇదిలా వుంటే నాలుగు అంశాలపై 'స్పీక్ అప్ ఇండియా' పేరుతో కాంగ్రెస్ సోషల్ మీడియా పోరాటం చేస్తోంది. ఏఐసీసీ పిలుపు మేర‌కు ఈ ఆన్‌లైన్ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొంటున్నారు. (జేబులు నింపుకోవడానికే ప్రాజెక్టులు)

మరిన్ని వార్తలు