మంచి జీవితం నవరత్నాలతోనే సాధ్యం ..

15 Mar, 2019 08:49 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ నవరత్నాలు

సాక్షి, పెళ్లకూరు: చంద్రబాబు నిరంకుశ పాలనలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల అధికారాలను తుంగలో తొక్కి ‘జన్మభూమి కమిటీలు’ ఏర్పాటుచేసి నిధులను టీడీపీ నేతలు స్వాహా చేసేలా చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేశారు. సంక్షేమం పేరుతో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అర్హుల చెంతకు చేరలేదు. తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి పాలన చూసిన ప్రజలు ‘మార్పు’ కోరుకుంటున్నారు. వారికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు భరోసా కల్పిస్తున్నాయి. జగన్‌ సీఎం అయితే ప్రతి ఇంట ఆనందం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. 

రూ.40 వేలు రుణమాఫీ అయింది..

వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పంటపై తీసుకున్న రుణం రూ.40 వేలు ఒకే దఫా రుణమాఫీ జరిగింది. చంద్రబాబునాయుడిని నమ్మి నిండా మునిగాం. ఆయన రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు. బ్యాంక్‌ నుంచి నోటీసులు రావడంతో రుణాన్ని విడతల వారీగా చెల్లించాల్సి వచ్చింది. వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడిచే వ్యక్తి జగన్‌. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రైతుల కష్టాలు తీరిపోతాయి.   – కొండా చిన్నఅంకయ్య, రైతు, తల్లంపాడు గ్రామం 

నిరుద్యోగ సమస్య ఉండదు..

వైఎస్సార్‌ హయాంలో సెజ్‌ భూముల్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అధికారంలోకి వస్తే జగన్‌మోహన్‌రెడ్డి పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా బిల్లు తెస్తామన్నారు. దీంతో నిరుద్యోగ సమస్య ఉండదు. జగన్‌పై నమ్మకం ఉంది. – పి.సుబ్బలక్ష్మి, ఎగువచావలి 

న్యాయం జరుగుతుంది..

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేసి అన్నివర్గాలకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆయన ఇచ్చిన మాటపై నిలబడతారు. – ఎ.రామకృష్ణ, గోమతి గార్డెన్, తాళ్వాయిపాడు 

రైతులు రారాజుల్లా బతుకుతారు

వైఎస్సార్‌ రైతు భరోసాతో రైతులందరూ రారాజుల్లా బతుకుతారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ, రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయక నిధి ఏర్పాటు చేస్తామని చెప్పడంతో అన్నదాతలకు భవిష్యత్‌పై భరోసా ఏర్పడింది.  – రఘునాయుడు, పెళ్లకూరు మిట్ట

పేదలకు కార్పొరేట్‌ వైద్యం

వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా చేస్తామని జగన్‌ ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ బాగా అమలవుతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పెన్షన్‌ అందించి జగనన్న ఆదుకుంటారు. – పోలంరెడ్డి శ్రీదేవి, నెలబల్లి 

మరిన్ని వార్తలు