నేడు మూడు జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ ప్రచారం

25 Mar, 2019 04:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాయలసీమ ప్రాంతంలోని మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఆదోని(కర్నూలు), 11.30 గంటలకు తాడిపత్రి (అనంతపురం), మధ్యాహ్నం రెండు గంటలకు మదనపల్లి(చిత్తూరు)లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

మరిన్ని వార్తలు