వైఎస్సార్‌ కడప: ఎన్నికల బరిలో సై

29 Mar, 2019 11:07 IST|Sakshi

సాక్షి, కడప సెవెన్‌రోడ్స్‌ : లోక్‌సభ, శాసనసభ సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గురువారం ముగిసింది. కడప లోక్‌సభ స్థానంలో 17 మంది ఉండగా, అందులో ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 15 మంది పోటీలో మిగిలారు. రాజంపేట లోక్‌సభ స్థానంలో 12 మంది ఉండగా,  ముగ్గురు ఉపసంహరించుకోగా, తొమ్మిది మంది మిగిలారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 28 మంది పోటీ నుంచి వైదొలిగారు. జమ్మలమడుగులో అత్యధికంగా 34 నామినేషన్లు దాఖలు కాగా, అందులో నాలుగు తిరస్కరించారు. మిగిలిన 30 నామినేషన్లను ఆమోదించారు.  చివరిరోజు 15 మంది  ఉపసంహరించుకోగా 15 మంది మిగిలారు. అభ్యర్థుల సంఖ్య 15కు మించితే రెండు బ్యాలెట్‌ యూనిట్లు ఉపయోగించాల్సి వస్తుంది. ఇందువల్ల చాలామంది ఓటర్లు తికమక పడే అవకాశం ఉంటుంది.

దీంతో కొందరు చొరవ చూపడంతో అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.  అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మిగిలిన కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలా నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో రెండవ బ్యాలెట్‌ యూనిట్‌ ఉపయోగించాల్సిన అవసరం రాకుండా పోయింది. రాయచోటిలో పది మంది అభ్యర్థులుండగా ఒక ఇండిపెండెంట్‌ అభ్యర్థి తప్పుకున్నారు. దీంతో తొమ్మిది మంది బరిలో మిగిలారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇండిపెండెంట్‌ ఉపసంహరించుకోవడంతో 15 మంది మిగి లారు. పులివెందుల నియోజకవర్గంలో ఏ ఒక్కరూ నామినేషన్‌ ఉపసంహరించుకోలేదు.

12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కమలాపురంలో 17 మంది ఉండగా, ఇద్దరు ఉపసంహరించుకోవడంతో 15 మంది పోటీలో నిలిచారు. ప్రొద్దుటూరులో ఇద్దరు ఉపసంహరించడంతో 12 మంది పోటీలో ఉన్నారురు. రైల్వేకోడూరులో 16 మంది అభ్యర్థులు ఉండగా ఒకరు ఉపసంహరించుకోవడంతో 15 మంది మిగిలారు. బద్వేలులో 14 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ  ఎవరూ ఉపసంహరించుకోలేదు. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 19 మంది అభ్యర్థులకుగాను నలుగురు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 15 మంది మిగిలారు. మైదుకూరు నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థుల్లో ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 11 మంది బరిలో ఉన్నారు. 

బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య:

కడప 15
పులివెందుల 12
జమ్మలమడుగు 15
ప్రొద్దుటూరు 12
మైదుకూరు 11
కమలాపురం 15
బద్వేలు 14
రాజంపేట 15
రాయచోటి 9
రైల్వేకోడూరు 15

ప్రధాన పార్టీ అభ్యర్థులు వీరే:

నియోజకవర్గం  వైఎస్సార్‌ సీపీ    టీడీపీ
కడప లోక్‌సభ    వైఎస్‌ అవినాష్‌రెడ్డి  సి.ఆదినారాయణరెడ్డి
రాజంపేట లోక్‌సభ    పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి    డీకే సత్యప్రభ

 అసెంబ్లీ నియోజకవర్గాలు:

నియోజకవర్గం వైఎస్సార్‌ సీపీ టీడీపీ
బద్వేలు    డాక్టర్‌ వెంకట సుబ్బయ్య    డాక్టర్‌ రాజశేఖర్‌
రాజంపేట     మేడా మల్లికార్జునరెడ్డి   బత్యాల చెంగల్రాయులు
కడప   ఎస్‌బీ అంజద్‌బాష     అమీర్‌బాబు
రైల్వేకోడూరు  కొరముట్ల శ్రీనివాసులు     పి. నరసింహప్రసాద్‌
రాయచోటి    గడికోట శ్రీకాంత్‌రెడ్డి   ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డి
పులివెందుల   వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్వీ సతీష్‌రెడ్డి
కమలాపురం    పి.రవీంద్రనాథ్‌రెడ్డి  పుత్తా నరసింహారెడ్డి
జమ్మలమడుగు డాక్టర్‌ సుధీర్‌రెడ్డి    పి.రామసుబ్బారెడ్డి
ప్రొద్దుటూరు  రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి   ఎం.లింగారెడ్డి
మైదుకూరు   ఎస్‌.రఘురామిరెడ్డి   పుట్టా సుధాకర్‌ యాదవ్‌   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు