ప్రజల భద్రతకు ముప్పు

5 Mar, 2019 08:52 IST|Sakshi

 చంద్రబాబు, లోకేష్‌ కనుసన్నల్లోనే ఓట్ల తొలగింపులు 

ప్రత్యేక దర్యాప్తు విభాగంతో విచారణ చేయించాలి

మాజీ ఎంపీ మేకపాటి, మాజీ మంత్రి ఆనం

నెల్లూరు (సెంట్రల్‌): ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను దొంగచాటుగా తీసుకున్న తీరును చూస్తే ప్రజల భద్రతలకే ముప్పు ఏర్పడిందని నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో మంగళవారం సమరశంఖారావం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తదితరులతో కలసి మంగళవారం విలేకరుల సమవేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 3.69 కోట్ల ఓట్లు ఉంటే అందులో దాదాపుగా 59 లక్షల ఓట్లు దొంగచాటుగా తొలగించడం, రెండు ఓట్లు చేయించడం వంటి నీచపు పనిని చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. (ఏపీ ప్రభుత్వ పాత్రపై.. అనుమానాలు)

మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, నారా లోకేష్‌ అండదండలతో ఐటి గ్రిడ్స్‌ పేరుతో ప్రతిపక్షానికి చెందిన ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఐదు కోట్ల మందికి చెందిన వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోయిందన్నారు. టీడీపీ ప్రభుత్వం సేవామిత్ర పేరుతో ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేసుకుని వ్యక్తిగత వివరాలు సేకరించి ఓట్లు తొలగింపు చేస్తున్నారన్నారు. ప్రజల వ్యక్తి గత సమాచారాన్ని సేకరించడంలో నారా లోకేష్‌తో సన్నిహితంగా ఉంటున్న అశోక్, కిలారి రాజేష్, పెద్ది రామారావు, అబిష్ణ తదితరులు ప్రధాన భూమిక పోషిస్తున్నారన్నారు. ప్రైవేటు ఏజన్సీలకు చంద్రబాబు రూ.కోట్లు కుమ్మరించి ఓట్ల తొలగింపు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధానంగా ఒక వ్యక్తి సమాచారన్ని మరొక వ్యక్తికి ఇవ్వరాదని సర్వోన్నత న్యాయ స్థానం కూడా చెప్పిందని, కాని నిబంధనలు బుట్టదాఖలు చేసి ఇలా చేయడం బాధాకరమన్నారు. వ్యక్తిగత జాబితాలను సేకరించి ఓట్లు తొలగించడంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు, ప్రధాన ఎన్నికల కమిషన్‌ కూడా దృష్టి సారించి ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఎస్‌వీజీఎస్‌ కళాశాల మైదానంలో మంగళవారం జరగనున్న సమరశంఖారావం సభ ఏర్పాట్లను వైఎస్సార్‌సీపీ నేతలు సోమవారం పరిశీలించారు. (ఏపీ పరువు తీశారు

మరిన్ని వార్తలు