వైఎస్‌ఆర్‌సీపీ క్రమశిక్షణ గల పార్టీ

17 Mar, 2018 13:48 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. నెల్లూరులో రెండో రోజు కొనసాగుతున్న పార్టీ రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన మాట్లాడాతూ.. ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కష్టపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా సాధిస్తుందని..  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కాబోయే సీఎం అని అన్నారు. బూత్‌ కమిటీ సభ్యులే పార్టీ విజయానికి కీలకం అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, కిలివేటి సంజీవయ్య, పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌, జెడ్పి చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు