‘టీడీపీకి కచ్చితంగా చెప్పుదెబ్బ’

21 Jun, 2018 20:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విభజన హామీల అమలు, ప్రత్యే హోదా విషయంలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకు ఎంపీ పదవులకు రాజీనామా చేశామని వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాజీనామా అనంతరం ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్షకు కూర్చున్నాం. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సూచించిన మార్గంలోనే నడిచి ఏపీకి హోదా కోసం రాజీనామా చేశాం. మా రాజీనామాల ఆమోదం కచ్చితంగా టీడీపీకి చెప్పుదెబ్బ. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీ నేతలు ఎంపీ పదవులు వదులుకున్నారు. కానీ టీడీపీ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో నాలుగేళ్లు బీజేపీతో కలిసుండి పదవులు అనుభవించారు. ఇప్పటికీ టీడీపీ ఎంపీలు రాజీనామా చేయలేదంటే.. పదవులు లేకుంటే వారు ఒక్కరోజు కూడా ఉండలేరని ఏపీ ప్రజలు గుర్తించారని’ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

మా రాజీనామాలు ఆమోదించినందుకు చాలా సంతోషంగా ఉంది. 13సార్లు పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మాణాలు ప్రవేశపెట్టాం. ఈ విషయంపై రాష్ట్రపతిని కలిశాం. చివరకు ఆమరణ నిరాహార దీక్షకు దిగాం. ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంటాం. ఓటమి భయంతోనే టీడీపీ మాపై బురద చల్లుతోంది. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదాను అవహేళన చేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్యాకేజీకి ఒప్పుకున్నారు. హోదా ఉద్యమం ఉధృతం కావడంతో బాబు తన అలవాటు ప్రకారం యూటర్న్‌ తీసుకున్నారని’  మాజీ ఎంపీ వరప్రసాద్‌ ఎద్దేవా చేశారు.

నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి హోదాను తీసుకురాలేక పోయారని టీడీపీ వైఫల్యాలను వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎండగట్టారు. సీఎం చంద్రబాబు ఓవైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ మరోవైపు నీతులు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం శారు. బీజేపీతో కలిసి చంద్రబాబు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హోదాపై ఎవరికి చిత్తశుద్ధి ఉందో ప్రజలు గమనిస్తున్నారని మేకపాటి అన్నారు. 

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సారథ్యంలో హోదాను కచ్చితంగా సాధించి తీరుతామని పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలను అందించే హోదాను అవహేళన చేసి చంద్రబాబు ప్యాకేజీకి ఆశపడటం వల్లే ఎన్నో నష్టపోయామన్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తూ ఉంటామని, సాధించే వరకు తమ పోరాటం ఆగదని మిథున్‌ రెడ్డి స్పష్టం చేశారు.

 

ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన కథనాల కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి :

వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం

మీ త్యాగం వృథా కాదు : వైఎస్‌ జగన్‌

చిత్తశుద్ధి నిరూపించుకున్నాం..

చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి..

వైఎస్‌ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా!

ఉప ఎన్నికలు: చంద్రబాబు పోటీకి రారు!

‘వంచన’పై వైఎస్సార్‌ సీపీ గర్జన!

మరిన్ని వార్తలు