సెల్ఫీ దిగడం మానేయండి! పేలకు చెక్‌ పెట్టండి!

6 Mar, 2019 09:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పేలు.. వీటితో బాధపడినవారు కనీసం ఇంటికొక్కరైనా ఉంటారు. ఆడపిల్లలకైతే ఈ బాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఇప్పటికీ మీరు పేల సమస్యతో బాధపడుతుంటే ఓసారి మీ అలవాట్లను చెక్‌ చేసుకోండి..! బహుశా మీకు సెల్ఫీ దిగే అలవాటు ఎక్కువగా ఉందేమో చూసుకోండి. ఎందుకంటే తలలో పేలు పెరగడానికి సెల్ఫీ దిగడానికి చాలా దగ్గర సంబంధం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ‘సెల్ఫీలంటే ఈ మధ్య పుట్టుకొచ్చిన పిచ్చి.

కానీ పేలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా?’ అనే అడగాలనుకుంటున్నారు కదూ? నిజమే.. అయితే తలలో పేలు పెరగడానికి ఎన్నో కారణాలున్నా.. సెల్ఫీ కూడా ఓ కారణమని చెబుతున్నారు. సెల్ఫీలు దిగే అలవాటు ఉన్నవారు స్నేహితులతో కలసి తలలు ఆనించుకుంటూ దిగుతారు. ఇటువంటప్పుడు ఒకరి తలలోని పేలు మరొకరి తలలోకి సులభంగా చేరిపోతాయట. అంతేకాదు.. చెవిదగ్గర పెట్టుకునే స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా కూడా పేలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పుడు లాజిక్‌ సరిపోయిందా!  

మరిన్ని వార్తలు