నన్ను వదిలించుకోవడానికే అలా చేశాడు!

19 Jan, 2020 14:53 IST|Sakshi

నా పేరు బుజ్జి. నేను బీటెక్‌ పూర్తి చేసిన ఇంట్లో ఉన్నాను. అప్పుడు మా నాన్న గారికి యాక్సిడెంట్ అయ్యింది . అప్పుడు మా నాన్నకి సాయంగా ఒక వారం రోజులు నేను హాస్పిటల్ ఉన్నాను. అప్పుడే ఫేసుబుక్‌లో నాకు హాయ్‌ అని ఒక మెసేజ్ వచ్చింది. నేను కూడా  హాయ్ అని పెట్టాను. తనకి నేను తెలిసినట్లే  చాట్ చేశాడు. నేను మా బాబాయికి చెప్పాను  ఇలా ఎవరో చాట్ చేస్తున్నారు అని,తను నీకు వరసకి బావ అవుతాడు అని మా బాబాయి చెప్పారు.  మన వాళ్ళే కదా అని చాట్ చేశాను.చాటింగ్ తరవాత కాల్స్ ఆలా ఆలా చాలా మాట్లాడుకున్నాము.తాను నాకు ప్రపోజ్‌ చేశాడు.నాకు అలాంటి ఆలోచన లేదు అన్నాను. నాకు చదువు ఇంకా మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండటం అదే తెలుసు. తను నన్ను పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు.నాకు టైం కావాలి అన్నాను.ఒక రోజు నాన్న గారిని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాం తను కూడా ఆ రోజు మా దగ్గరికి వచ్చారు.  అదే ఫస్ట్ టైం తనని చూడటం . చూడగానే నాకు నచ్చారనిపించింది.  మా ఇంట్లో చెప్పాను కులాలు కూడా ఒక్కటే మా ఇంట్లో ఒపుకున్నారు.  కానీ తన ఇంట్లో ఒప్పుకోవాలంటే మంచి జాబ్ తెచ్చుకోవాలి అప్పుడే మా ఇంట్లో చెప్తాను అన్నాడు.అవును కదా మంచి పొజిషన్‌లో  ఉంటే అందరికి మంచిది కదా అని అనుకున్నాను.

తను జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు. కానీ తనకి జాబ్ రాలేదు, నాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. నేను హైదరాబాద్ వెళ్ళాను. మా ఇంట్లో నాకు మంచి సంబంధాలు వస్తున్నాయి. కానీ తనకి జాబ్ లేదు కాబట్టి నన్ను వేరే సంబంధం చేసుకోమని మా నాన్నమ్మ ఫోర్స్ చేసింది. అప్పుడే తనకి నాకు తెలిసిన ఆఫీసులోనే జాబ్ ఇప్పించాను.మా ఇంట్లోపెళ్లి చూపులకి వచ్చి వెళ్ళు అని ఫోర్స్ చేశారు. నేను ఆ విషయం తనకి చెప్పాను ఒకసారి వెళ్లి రా .. అని చెప్పాడు. తరువాత తనకి  జాబ్ చేసే దగ్గర ఒక అమ్మాయి పరిచయం అయింది.  తను నన్ను అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు .  నాకు నాకు తెలియదు వాళ్ళు లవ్ చేసుకుంటున్నారని,నేను అడిగాను ఎందుకు బావ నన్ను అవాయిడ్ చేస్తున్నావ్ అని.  అప్పుడు నన్ను చాలా తిట్టాడు పెళ్లి
చూపులకి ఎందుకు వెళ్ళావ్ అని. కానీ నిజం ఏమిటంటే తను వెళ్ళమంటేనే నేను వెళ్ళాను, మా ఇంట్లో టైం అడిగి వచ్చాను. అది తను నమ్మలేదు.  నన్ను వదిలించుకోవడానికే ఇదంత చేశాడు అని నాకు తెలిసింది . నాకు తనంటే చాలా ఇష్టం.  తన కోసం ఏమైనా చేస్తా అని తెలుసు. అందుకేనేమో  తను త్వరగా ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో చెప్పి 15రోజుల్లోనే  పెళ్లి చేసున్నారు. నాకు చచ్చిపోవాలనిపించింది. చాలా ఏడ్చాను. కానీ తను చాలా హ్యాపీగా ఉన్నాడు. అబ్బాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను అదే నా ఫస్ట్ లవ్ కూడా. ఎప్పుడు తను హ్యాపీగా ఉండాలని ఆ దేవుడ్ని  కోరుకుంటున్నాను.

బుజ్జి(గుంటూరు). 

Read latest Romance News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా