పళ్ళపై పసుపు మరకలు పోవాలంటే..

19 Nov, 2023 11:38 IST|Sakshi

నవ్వుతోనే ముఖం ఆకట్టుకుంటుంది. తెల్లని పలువరుస ఆ నవ్వును ప్రభావితం చేస్తుంది. కానీ పళ్లపై పసుపు గారలు.. నోటి దుర్వాసన వల్ల నవ్వు సంగతి అటుంచి అసలు నోరు తెరవడానికే భయపడుతుంటారు ఆ సమస్యలున్న వాళ్లు. అలాంటి వాళ్లు ఈ హోం రెమిడ్సి పాటిస్తే చాలా ఈజీగా ఆ సమస్యకు చెక్‌ పెట్టొయొచ్చు. అవేంటంటే..

వీటికి ఓ చిన్న చిట్కాతో చెక్‌ పెట్టొచ్చు. రసం తీసిన నిమ్మతొక్కతో పళ్ళను రుద్దుకుంటే క్రమంగా పసుపు మరకలు పోవడమే కాదు.. నోటి దుర్వాసనా  తగ్గుతుంది. అయితే నిమిషం కంటే ఎక్కువసేపు రుద్దకూడదు. ఎక్కువ రుద్దితే పళ్ళు బలహీనమవుతాయి. ఏదైనా అతి మంచిది కాదుకదా! సో..

తులసి ఆకులు- ఎండిన నారింజ తొక్కలు: ముందుగా 7 తులసి ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ఎండిన నారింజ తొక్కను కొద్ది మొత్తంలో తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత రెండింటినీ కలిపి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని దంతాలపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా ప్రతి రోజు చేస్తుంటే త్వరితగతిన దంతాలు తెల్లగా మారతాయి.

బేకింగ్‌సోడా నీరు: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బేకింగ్‌సోడాల నీరు పోసి పేస్ట్‌లా చేసి దీన్ని పళ్లకు అప్లై చేసి రుద్దిన పసుపు మచ్చలు పోతాయి. 

అలాగే ఉప్పు నిమ్మరసం కూడా చక్కటి ఫలితం ఇస్తుంది. ఈ చక్కటి ఇంటి చిట్కాలను పాటించి స్థైర్యంగా నవ్వండి.

(చదవండి: ఆపరేషన్‌ బ్యూటీ! అందం కోసం తీసుకునే ఇంజక్షన్‌లు మంచివేనా!)

 


  

మరిన్ని వార్తలు