వైరల్‌ : కాలు కదిపిన ఫాదర్‌..!

20 Sep, 2019 20:37 IST|Sakshi

న్యూఢిల్లీ : ఉత్సాహం ఉప్పొంగితే ఏ వయసువారైనా.. ఏ హోదాలో కొనసాగుతున్నా దాన్ని వ్యక్తం చేస్తారు. లోన దాగున్న పసిహృదయానికి స్వేచ్ఛనిస్తారు. ఢిల్లీలో తాజాగా అలాంటి విశేషమే ఒకటి వెలుగుచూసింది. ఓ చర్చి ఫాదర్‌ మలయాళ హిట్‌ సినిమా ‘లవ్‌ యాక్షన్‌ డ్రామా’లోని అద్భుతమైన పాట ‘కుడుక్కు పొట్టియా కుప్పాయాం’కు కాలు కదిపాడు. అద్భుతమైన స్టెప్పులతో అక్కడున్న వారిని అలరించాడు. ఫాదర్‌ నుంచి ఊహించని ప్రదర్శన రావడంతో చర్చి ప్రాంగణంలో ఉన్నవారందరూ ఈల వేసి గోల చేశారు. ఆయనకు మద్దతు పలికారు.

ఈ వీడియోను ‘లవ్‌ యాక్షన్‌ డ్రామా’ హీరో నివిన్‌ పౌళీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘మా సినిమాలోని కుడుక్కు పొట్టియా కుప్పాయాం పాటకు ఫాదర్‌ మాథ్యూస్‌ కిజాచెచిరా డ్యాన్స్‌ చేశారు. తన టీమ్‌తో పాటు స్టెప్పులు వేసి అలరించారు. థాంక్యూ.. ఫాదర్‌’అని పేర్కొన్నాడు. అయితే, తనతో పాటు చర్చి పనుల్లో భాగమయ్యే కొందరు యువకుల పిలుపుమేరకే సరదాగా డ్యాన్స్‌ చేశానని ఫాదర్‌ మాథ్యూస్‌ చెప్పారు. ఇక 2018లో వచ్చిన లవ్‌ యాక్షన్‌ డ్రామా సినిమాలోని ‘కుడుక్కు పొట్టియా కుప్పాయాం’పాట బాగా ఫేమస్‌ అయింది.

ఇటీవల జరిగిన ఓనమ్‌ పండుగలో ఈ పాటకు భారీ ప్రాచుర్యం లభించింది. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ కుడుక్కు పొట్టియా కుప్పాయాం అంటూ తమదైన శైలిలో స్టెప్పులు వేశారు. ఇక ఫాదర్‌ డ్యాన్స్‌ వీడియో గత మంగళవారం సోషల్‌ మీడియాలో పోస్టు కాగా.. నాలుగు రోజుల్లోనే పాపులర్‌ అయింది. యూట్యూబ్‌లో దాదాపు 3 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా