బహిరంగ క్షమాపణ చెప్పాలి

30 Dec, 2017 07:06 IST|Sakshi

 అంజనీపుత్ర నిర్మాత, దర్శకుడుకి లాయర్ల డిమాండ్‌

న్యాయవాదులను కించపరిచే సన్నివేశాలు తొలగించాలి

శివాజీనగర : అంజనీపుత్ర సినిమాలో న్యాయవాదులను కించపరిచే సన్నివేశాలను తక్షణం తొలగించి దర్శకుడు, నిర్మాత బహిరంగ క్షమాపణ చెప్పాలని లాయర్లు డిమాండ్‌ చేశారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ... కోర్టు ఆదేశించినా అంజనీపుత్ర చిత్రాన్ని ప్రదర్శించడం కోర్టు ఆదేశాలను ఉల్లఘించారని, ఈ విషయం కోర్టు తీవ్రంగా పరిగణించిందన్నారు. లాయర్ల పట్ల కించపరిచే సన్నివేశాలు, డైలాగులను తక్షణం తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న న్యాయవాదులు

మరిన్ని వార్తలు