20 కోట్ల ఫాలోవర్లు! 

31 Jan, 2020 03:18 IST|Sakshi

ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో రికార్డు

న్యూఢిల్లీ: ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో సోషల్‌ మీడియా మైదానంలో కూడా తనకు ఎదురులేదని మరోసారి నిరూపించాడు. ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో అతడిని అనుసరించే వారి సంఖ్య ఏకంగా 200 మిలియన్లకు (20 కోట్లు) చేరుకుంది. ఈ మైలురాయిని దాటిని తొలి వ్యక్తి రొనాల్డోనే కావడం విశేషం. స్వయంగా ‘ఇన్‌స్టాగ్రామ్‌’ మాత్రమే రొనాల్డో కంటే 3 కోట్ల 30 లక్షల మంది ఫాలోవర్లతో అతనికంటే ముందుంది! తన పోస్ట్‌ల ద్వారా రొనాల్డో తన ఆటకంటే ఎక్కువగా ఆర్జిస్తున్నట్లు ప్రఖ్యాత మార్కెటింగ్‌ కంపెనీ ‘హాపర్‌ హెచ్‌క్యూ’ ఇటీవలి సర్వేలో తేలింది. రొనాల్డో తన ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో ప్రచారానికి ఒక్కో ప్రకటనకు 9 లక్షల యూరోలు (సుమారు రూ. 7 కోట్ల 10 లక్షలు) తీసుకుంటున్నాడు. వీటి ద్వారానే అతనికి ఏడాదికి 48 మిలియన్ల యూరోల (సుమారు రూ. 379 కోట్లు) ఆదాయం వస్తోంది. తాను లీగ్‌లో ఆడుతున్న క్లబ్‌ యువెంటాస్‌ రొనాల్డోకు ఏడాదికి 34 మిలియన్ల యూరోలు (సుమారు రూ. 268 కోట్లు) చెల్లిస్తోంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు