‘బుమ్రా, షమీ.. మీ కాన్ఫిడెన్స్‌ సూపర్‌’

27 Jan, 2020 16:49 IST|Sakshi

వణుకు పుట్టించడం స్టార్ట్‌ చేశారు: అక్తర్‌

కరాచీ: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం చవిచూడటాన్ని దుమ్మెత్తిపోసిన పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌.. న్యూజిలాండ్‌తో వరుస రెండు టీ20లను విరాట్‌ గ్యాంగ్‌ గెలుచుకున్న తర్వాత ఆకాశానికెత్తేశాడు. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో మొదటి రెండు టీ20లను భారత్‌ గెలుచుకున్న తీరు అబ్బురపరిచిందన్నాడు.. అసలు భారత్‌కు న్యూజిలాండ్‌ దాసోహం అయిపోయినట్లే కనబడిందన్నాడు. భారత్‌ జట్టుకు సమాధానం ఇవ్వడానికి కివీస్‌ వద్ద సమాధానమే లేకుండా పోయిందని అక్తర్‌ పేర్కొన్నాడు. ‘ రెండో టీ20 చూడండి. కివీస్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ కల్గిన టీమిండియా తరహా జట్టు ముందు ఆ స్కోరుతో ఎలా పోరాడతారు. ఈ మ్యాచ్‌లో కివీస్‌ బ్యాటింగ్‌ చేసిన తర్వాత విజయం టీమిండియాదేనని ఫిక్స్‌ అయ్యింది. కివీస్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేసిన క్రెడిట్‌ భారత బౌలింగ్‌ యూనిట్‌ది. ఒకవైపు పేసర్లు, మరొకవైపు స్పిన్నర్లు కివీస్‌కు చుక్కలు చూపించారు. (ఇక్కడ చదవండి: మంజ్రేకర్‌ను టీజ్‌ చేసిన జడేజా)

ప్రధానంగా జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీలు రెచ్చిపోయి బౌలింగ్‌ చేశారు. కివీస్‌ను బెంబెలెత్తేంచారు. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ తలే లక్ష్యంగా షార్ట్‌ పిచ్‌ బంతులతో హడలెత్తించారు. ఈ మ్యాచ్‌ మొత్తం వారు దూకుడైన మైండ్‌సెట్‌తో బౌలింగ్ చేశారు. ఇక బుమ్రా, షమీలు బ్యాట్స్‌మెన్‌ వెన్నులో వణుకు పుట్టించడం స్టార్ట్‌ చేశారు.  షమీ, బుమ్రాల్లో ఈ తరహా కాన్ఫిడెన్స్‌ నేను ఇంతకుముందు చూడలేదు. భారత బౌలింగ్‌ను కివీస్‌ తక్కువ అంచనా వేసింది.. అందుకు మూల్యం చెల్లించుకుంది. తలకు గురిపెట్టి షాట్‌ పిచ్‌ బంతులు వేయడంతో బంతి పదే పదే ఎడ్జ్‌ తీసుకుంది. రవీంద్ర జడేజా కచ్చితమైన స్పిన్‌తో మెరిశాడు. పరుగులను నియంత్రిస్తూ వేసిన జడేజా పెట్టిన పరీక్షలో కివీస్‌ విఫలమైంది. ఫలితంగా మ్యాచ్‌లో ముందుగానే కివీస్‌ లొంగిపోయింది. ఆస్ట్రేలియా ప‍్రపంచ క్రికెట్‌ను శాసించిన సమయంలో భారత్‌, పాకిస్తాన్‌ కనీసం పోరాటం చేసేవి. ఇప్పుడు న్యూజిలాండ్‌ను చూడండి. ప్రపంచలో మేటి జట్టైన భారత్‌ ముందు కనీసం పోరాటం కూడా చేయలేకపోతుంది’ అని అక్తర్‌ తన యూట్యూబ్‌ చానల్‌లో స్పష్టం చేశాడు. (ఇక్కడ చదవండి: బుమ్రాపై గప్టిల్‌ ప్రశంసలు)

మరిన్ని వార్తలు