ముంబై టి20 లీగ్‌ నుంచి తప్పుకొని... 

2 Mar, 2018 01:11 IST|Sakshi
సచిన్‌ టెండూల్కర్‌ , అర్జున్‌ టెండూల్కర్‌

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ ముంబై టి20 లీగ్‌ నుంచి తప్పుకున్నాడు. తండ్రి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతుల్‌ గైక్వాడ్‌ శిక్షణలో బౌలింగ్‌ శైలికి తుది మెరుగులు దిద్దుకుంటున్న అర్జున్‌ టెండూల్కర్‌ ఇప్పుడప్పుడే పోటీ క్రికెట్‌లో అడుగుపెట్టొద్దని సచిన్‌ సూచించడంతో ఈ లీగ్‌ నుంచి తప్పుకున్నాడు.

సచిన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఈ లీగ్‌లో ఆరుజట్లు పాల్గొంటాయి. వాంఖెడే వేదికగా ఈ నెల 11 నుంచి 21 వరకు ఈ లీగ్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా