యాషెస్‌ సిరీస్‌: విజయం ముంగిట ఆసీస్‌

26 Nov, 2017 13:17 IST|Sakshi

అర్ధశతకాలతో రాణించిన ఆసీస్‌ ఓపెనర్లు

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ స్కోరు 114/0

బ్రిస్బేన్‌: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయానికి కూతవేటు దూరంలో ఉంది.  ఆసీస్‌ విజయానికి కేవలం 56 పరుగులే అవసరం. 170 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్‌ ఓపెనర్లు డెవిడ్‌ వార్నర్(60)‌, బాన్‌క్రాఫ్ట్‌(51)లు అర్ధ శతకాలతో రాణించారు. దీంతో నాలుగో రోజు ఆటముగిసే సమయానికి ఆసీస్‌ వికెట్‌ నష్టపోకుండా 114 పరుగులు చేసింది. 

అంతకు ముందు 33/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ జోరూట్‌ అర్ధశతకం మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవ్వడంతో 195 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌, లియోన్‌‌,  హజల్‌వుడ్‌లు మూడేసి వికెట్లు పడగొట్టగా.. కమిన్స్‌కు ఒక వికెట్‌కు దక్కింది. ఇక ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ విరోచిత సెంచరీతో 27 పరుగుల ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు