సస్పెన్షన్‌లో ఉన్న క్రికెటర్‌కి జట్టులో చోటు..

24 Jul, 2018 11:14 IST|Sakshi

ఢిల్లీ: చిత్రవిచిత్రమైన పనులు చేయడంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) రూటే సపరేటు. డోపింగ్‌లో సస్పెన్షన్‌కు గురైన క్రికెటర్‌ను దులీప్‌ ట్రోఫీకి ఎంపిక చేసిన బోర్డు అభాసుపాలైంది. పంజాబ్‌ వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ అభిషేక్‌ గుప్తాకు ఇండియా రెడ్‌ జట్టులో చోటు కల్పించారు.

అయితే, అతడి సస్పెన్షన్‌ సెప్టెంబర్‌ 14తో ముగుస్తుంది. కానీ దులీప్‌ ట్రోఫీ వచ్చే నెల 17 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు జరగనుంది. గుప్తా నిషిద్ధ ఉత్ర్పేరకం టర్బుటలిన్‌ ఉపయోగించినట్టు డోపింగ్‌ పరీక్షలో బయటపడడంతో అతడిపై జనవరి 15 నుంచి ఎనిమిది నెలలపాటు సస్పెన్షన్‌ వేటు వేశారు. అయినా సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

చదవండి: డోపింగ్‌కు పాల్పడినందుకు కీపర్‌పై వేటు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు