తొలిసారి భారత్‌కు రానున్న దిగ్గజ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ 

14 Aug, 2018 00:58 IST|Sakshi

ప్రపంచ హెవీవెయిట్‌ బాక్సింగ్‌ మాజీ చాంపియన్‌ మైక్‌ టైసన్‌ వచ్చే నెలలో భారత్‌కు విచ్చేయనున్నారు. అంతర్జాతీయ మార్షల్‌ ఆర్ట్స్‌ లీగ్‌ ప్రాచుర్య కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సెప్టెంబర్‌ 29న ఈ వివాదాస్పద బాక్సర్‌... మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎమ్‌ఎమ్‌ఏ) ఈవెంట్‌ అయిన కుమిటే–1 లీగ్‌ను ప్రచారం చేసేందుకు ముంబై వస్తున్నారని లీగ్‌ వర్గాలు తెలిపాయి.

భారత మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ సమాఖ్య ఆధ్వర్యంలో తొలిసారిగా జరిగే ఈ టోర్నీలో భారత్‌ తమ తొలి బౌట్‌లో యూఏఈని ఎదుర్కొంటుంది. లీగ్‌ వ్యవస్థాపకులు మొహమ్మద్‌ అలీ బుద్వాని మాట్లాడుతూ కుమిటే లీగ్‌ కోసం ప్రపంచ మాజీ చాంపియన్‌ రానుండటం ఆనందంగా ఉందన్నారు.  

మరిన్ని వార్తలు