‘క్రికెట్‌లో అతనే అత్యుత్తమం’

23 Mar, 2020 11:58 IST|Sakshi

ఆంటిగ్వా: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆటను అభిమానించే మాజీల జాబితాలో మరో క్రికెటర్‌ చేరాడు. వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు శివనారాయణ్‌ చంద్రపాల్‌ కూడా కోహ్లి ఆటంటే తనకు ఇష్టమని వెల్లడించాడు. కోహ్లి ఆట సూపర్‌ అంటూ కొనియాడాడు. ప్రతీసారి అత్యుత్తమ ప్రదర్శన  చేసే ఆటగాళ్లలో కోహ్లి ఒకడన్నాడు. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నాడనడానే విషయాన్ని అతని ర్యాంకింగ్స్‌ చెబుతున్నాయన్నాడు.

‘క్రికెట్‌లో అతను సాధించిన ఘనతలే చెబుతున్నాయి కోహ్లి అత్యుత్తమం అని. కోహ్లి చాలా ఎక్కువ సందర్భాల్లో టాప్‌ ర్యాంకింగ్స్‌లో ఉన్నాడు. ఇలా ఒక ఆటగాడు ఎప్పుడూ బ్యాట్‌తో రాణించడం అంటే సాధారణ విషయం కాదు. కచ్చితంగా కోహ్లి ఒక అసాధారణ ఆటగాడు. ఫిట్‌నెస్‌ విషయంలో కూడా కోహ్లి శ్రమించే తీరు బాగుంటుంది. కోహ్లి ఏమిటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఒక గేమ్‌లో సుదీర్ఘ కాలం టాప్‌లో నిలవడం అంటే మామూలు విషయం కాదు. అతను కష్టించే తీరే కోహ్లిని టాప్‌లో నిలబెట్టింది’ అని చంద్రపాల్‌ తెలిపాడు. ఇప్పటి వరకూ కోహ్లి తన అంతర్జాతీయ కెరీర్‌ 70 సెంచరీలు చేశాడు. వన్డేల్లో 43 సెంచరీలు, టెస్టుల్లో 27 సెంచరీలు సాధించాడు. కాగా, ఇటీవల న్యూజిలాండ్‌ పర్యటనలో మాత్రం కోహ్లి విఫలమయ్యాడనే చెప్పాలి. కేవలం ఆ పర్యటనలో 11 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి 218 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్‌ సెంచరీ మాత్రమే ఉంది. 


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా