ఐపీఎల్‌: గ్రాండ్‌హోమ్‌ వచ్చాడు.!

25 Apr, 2018 19:49 IST|Sakshi
టాస్‌ వేస్తున్న కోహ్లి

కోహ్లి సేనదే బ్యాటింగ్‌

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ తీసుకున్న మిస్టర్‌ కూల్‌

బెంగళూరు : ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన చెన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆతిథ్య జట్టును బ్యాటింగ్‌ ఆహ్వానించాడు. ఇక ఈ సీజన్‌లో తొలిసారి తలపడుతున్న ఇరు జట్లు విజయం కోసం ఆరాట పడుతున్నాయి. ఇరు జట్లు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. బెంగళూరులో మనన్‌ వోహ్రా, క్రిస్‌ వోక్స్‌ స్థానాల్లో పవన్‌ నేగి, గ్రాండ్‌ హోమ్‌లు రాగా.. చెన్నైలో కరణ్‌ శర్మ, డుప్లెసిస్‌ స్థానాల్లో హర్భజన్‌, తాహీర్‌లు వచ్చారు.

డివిలియర్స్‌ విధ్వంసంతో ఢిల్లీడేర్‌ డెవిల్స్‌పై గెలిచిన కోహ్లిసేన మరో విజయం కోసం ఉవ్విళ్లురుతోంది. ఇక వరుస విజయాలతో జోరు మీదున్న ధోని సేన తమ విజయయాత్రను కొనసాగించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లాడిన చెన్నై నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవగా.. కోహ్లి సారథ్యంలోని బెంగళూరు జట్టు 5 మ్యాచ్‌లాడి 2 విజయాలు మాత్రమే సాధించింది. ధోని సారథ్యంలో టెస్టులు, వన్డేల్లో అరంగేట్రం చేసిన కోహ్లి అతని నాయకత్వంలోనే గొప్ప ఆటగాడిగా ఎదిగాడు. ఈ నేపథ్యంలో సాగుతున్న గురు-శిష్యుల పోరు అభిమానులను కనువిందు చేయనుంది.

తుది జట్లు

చెన్నై సూపర్‌కింగ్స్‌ : ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), షేన్‌ వాట్సన్‌, అంబటి రాయుడు, సురేశ్‌ రైనా, డ్వేన్‌ బ్రేవో, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, రవీంద్ర జడేజా, బిల్లింగ్స్‌, ఇమ్రాన్‌ తాహీర్‌, హర్బజన్ సింగ్‌

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ : విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌, క్వింటన్‌ డి కాక్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యుజువేంద్ర చహల్‌, ఉమేశ్‌ యాదవ్‌, మన్‌దీప్‌ సింగ్‌, కోలిన్ డి గ్రాండ్‌హోమ్‌, కోరే అండర్సన్‌, పవన్‌ నేగి, సిరాజ్‌

>
మరిన్ని వార్తలు