టైటాన్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి

25 Jul, 2019 04:49 IST|Sakshi

దబంగ్‌ ఢిల్లీ చేతిలో పాయింట్‌ తేడాతో పరాజయం

సాక్షి, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ వరుసగా మూడో పరాజయంతో హ్యాట్రిక్‌ నమోదు చేసింది. కానీ ఈ సారి గెలిచేందుకు చివరిదాకా కష్టపడింది. మ్యాచ్‌ ముగిసే దశలో కాస్త ఉత్కంఠరేపినా... స్వల్ప ఆధిక్యాన్ని కాపాడుకున్న దబంగ్‌ ఢిల్లీ కేసీ జట్టు 34–33తో తెలుగు టైటాన్స్‌పై గట్టెక్కింది. కేవలం పాయింట్‌ తేడాతో టైటాన్స్‌ పరాజయం చవిచూసింది. కోటి ఆశల సిద్ధార్థ్‌ దేశాయ్‌ నిరాశపరిచాడు. జట్టు తురుపుముక్కగా బరిలోకి దిగిన ఈ రైడర్‌ 13 సార్లు కూతకు వెళ్లి కేవలం 8 పాయింట్లే చేశాడు. ఇతని సోదరుడు సూరజ్‌ దేశాయ్‌ అదరగొట్టాడు. 15 సార్లు రైడింగ్‌కు వెళ్లి 18 పాయింట్లు తెచ్చిపెట్టాడు. స్టార్‌ డిఫెండర్‌ విశాల్‌ భరద్వాజ్‌ కూడా నిరాశపరిచాడు. ప్రత్యర్థి రైడర్లను పట్టేందుకు 7 సార్లు కష్టపడిన భరద్వాజ్‌ కేవలం 4 పాయింట్లే సాధించాడు. మిగతా ఆటగాళ్లలో అమిత్‌ 2 పాయింట్లు చేశాడు. దబంగ్‌ ఢిల్లీ జట్టులో రైడర్లు నవీన్‌ కుమార్‌ (14 పాయింట్లు), చంద్రన్‌ రంజీత్‌ (6) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. డిఫెండర్లలో జోగిందర్‌ నర్వాల్‌ (4), రవీందర్‌ పహల్‌ (3) రాణించారు.  

యూపీ యోధ చిత్తుగా...
అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో యూపీ యోధ 17–48 స్కోరుతో బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో చిత్తుగా ఓడింది. రైడర్లు మొహమ్మద్‌ నబీబ„Š  (10), మణిందర్‌ సింగ్‌ (9) చెలరేగారు. డిఫెండర్లు కూడా తమ వంతుగా రాణించడంతో బెంగాల్‌ స్కోరు అమాంతం పెరిగింది. బల్‌దేవ్‌ సింగ్‌ 7, రింకూ నర్వాల్‌ 4, జీవా కుమార్‌ 3 పాయింట్లు సాధించారు. యూపీ యోధ తరఫున మోను గోయత్‌ (6), సురేందర్‌ సింగ్, నితీశ్‌ కుమార్‌ చెరో 3 పాయింట్లు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీతో తమిళ్‌ తలైవాస్‌ జట్టు తలపడుతుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేను తప్పులు చేశా... వారు చేయకుండా ఆపుతున్నా!

జపాన్‌ ఓపెన్‌: శ్రీకాంత్, సమీర్‌ ఔట్‌

టైటాన్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి..

గర్జించిన బెంగాల్‌‌.. కుదేలైన యూపీ

‘సారథిగా తప్పుకుంటే నీకే మంచిది’

ఆర్చర్‌.. టైమ్‌ మిషన్‌ ఉందా ఏందీ?

సద్గురు ట్వీట్‌.. నెటిజన్ల ఆగ్రహం

ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్‌

అవే నన్ను రాటుదేలేలా చేసాయి : కోహ్లి

రోహిత్‌ ఒకే ఒక్కడు..

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన లంక బౌలర్‌ 

ఆ షూస్‌ ధర రూ. 3 కోట్లు!

సచిన్‌నే తికమక పెట్టిన ఘటన!

ఫైనల్లో లార్డ్స్, కేంద్రీయ విద్యాలయ 

సత్తా చాటిన హైదరాబాద్‌ సెయిలర్స్‌

కోహ్లి ఒక్క పోస్ట్‌కు రూ.కోటి!

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

ఎందుకలా..?: గంగూలీ ఆశ్చర్యం

భారత క్రికెటర్ల సంఘం కూడా...

నరైన్, పొలార్డ్‌లకు పిలుపు

మిఠాయిలు, మసాలాలు వద్దే వద్దు..

ఐర్లాండ్‌కు సువర్ణావకాశం

క్వార్టర్స్‌లో హుసాముద్దీన్‌

సాయిప్రణీత్‌  శుభారంభం 

వసీం అక్రమ్‌కు ఘోర అవమానం

అందుకే కోహ్లి విశ్రాంతి తీసుకోలేదు!

నాకొద్దు.. అతడికే ఇవ్వండి: స్టోక్స్‌

టెస్ట్‌ నెం1 ర్యాంకు మనదే.. మనోడిదే!

అలిసన్‌ స్టెప్పేస్తే.. సానియా ఫిదా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హ్యాట్రిక్‌కి రెడీ

సున్నితమైన ప్రేమకథ

సెట్‌కు నాలుగు కోట్లు?

ఇట్స్‌ షో టైమ్‌

కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం

నేను మారిపోయాను!