అచ్చం జడేజాలాగే తిప్పానా.. మీరే చెప్పండి

8 Apr, 2020 22:10 IST|Sakshi

ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్ తను చేసే ప్రతి విషయాన్ని సోషల్‌ మీడియాలో ఎంతో చురుకుగా పంచుకుంటాడు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమై సోషల్‌ మీడియా ద్వారా తమ అభిమానులకు ఆనందాన్ని పంచుతూనే ఉన్నారు. కాగా వార్నర్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గతేడాది ఐపీఎల్‌లో భాగంగా వార్నర్‌ తన చేతిలోని బ్యాట్‌ను కత్తిసాములాగా అటు ఇటూ తిప్పిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఆ వీడియోలో వార్నర్‌ ..' గ‌తేడాది ఇదే స‌మ‌యంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌ఫున వాణిజ్య కార్య‌క్ర‌మంలో భాగంగా క‌త్తిసాములాగే బ్యాట్‌ను తిప్పాను. అయితే బ్యాట్‌ను జడేజా తిప్పినంత అందంగా ఎవరు తిప్పలేరు. అందుకే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్న... నేను తిప్పింది అచ్చం జ‌డ్డూ తిప్పినట్లుగా ఉందా లేదా అనేది చెప్పండి' అంటూ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. (మహ్మద్‌ కైఫ్‌కు షోయబ్‌ అక్తర్‌ సవాల్‌)

కాగా టీమిండియా ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా మైదానంలో అర్థశతకం, శతకం లేదా ఏవైనా వ్యక్తిగత రికార్డులు సాధించినప్పుడు కత్తిలాగే బ్యాట్‌ను తిప్పి తన అభిమానుల మనసు దోచుకునేవాడు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా  ఐపీఎల్ వాయిదా ప‌డ‌టంతో ప్ర‌స్తుతం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి గ‌డుపుతున్న వార్న‌ర్‌.. కొవిడ్‌-19పై పోరాటం చేస్తున్న సిబ్బందికి మ‌ద్ద‌తుగా  ట్రిమ్మ‌ర్‌తో జ‌ట్టు క‌త్తిరించుకున్న విషయం తెలిసిందే.

Throwback to this time last year to a commercial we were doing for @sunrisershyd Do you think I’ve got @royalnavghan covered for the sword?? 😂😂

A post shared by David Warner (@davidwarner31) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా