Suryakumar Yadav Viral Video: అయ్యో సూర్య.. ఊతకర్ర సాయంతో మిస్టర్‌ 360! వీడియో వైరల్‌

24 Dec, 2023 15:34 IST|Sakshi

టీమిండియా స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ గాయం కారణంగా దాదాపు రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్‌ చేస్తుండగా సూర్య కాలు మెలిక పడింది. అనంతరం స్కానింగ్‌ తరలించగా చీలమండలో చీలిక వచ్చినట్లు తేలింది.

సూర్య పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే స్వదేశంలో జరగనున్న అఫ్గాన్‌తో టీసిరీస్‌కు మిస్టర్‌ 360 దూరమయ్యాడు. అయితే తన గాయంపై సూర్యకుమార్‌ తొలిసారి స్పందించాడు. త్వరగా గాయం నుంచి కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాని సూర్య తెలిపాడు. 

ఊతకర్ర సాయంతో నడుస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో సూర్య షేర్‌ చేశాడు.  "గాయపడటం సరదాగా ఏమీ ఉండదు. అయితే, గాయాలను నేను మరీ అంత సీరియస్‌గా తీసుకోను. ఈ గాయం నుంచి త్వరగా బయటపడేందుకు తీవ్రంగా శ్రమిస్తాను. అతి త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతానని హామీ ఇస్తున్నాను.

అప్పటివరకు మీరందరూ ఈ హాలిడే బ్రేక్‌నును ఫ్యామీలీతో ఎంజాయ్‌ చేస్తూ సరదాగా ఉంటారని ఆశిస్తున్నాను" ఆ వీడియోకు క్యాప్షన్‌గా సూర్య రాసుకొచ్చాడు. ఇదిచూసిన నెటిజన్లు సూర్య త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో సూర్య అదరగొట్టాడు. మూడో మ్యాచ్‌ల సిరీస్‌లో సూర్య ఒక సెంచరీ, ఒక ‌ర్ధ సెంచరీతో 156 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు.

అదే విధంగా ఈ ఏడాది మొత్తం కూడా టీ20ల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. . ఈ ఏడాది 18 టీ 20 మ్యాచ్‌లు ఆడిన  సూర్యకుమార్.. 48.86 సగటు.. 155.95 స్ట్రైక్ రేట్‌తో 733 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా తన కెరీర్‌లో ఇప్పటివరకు 60 టీ20 మ్యాచుల్లో సూర్యకుమార్ నాలుగు సెంచరీలు, 17 అర్ధసెంచరీలతో  2,141 పరుగులు చేశాడు. కాగా సూర్య ప్రస్తుతం టీ20ల్లో నెం1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
చదవండిIND Vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే! ఓపెనర్లు ఎవరంటే?

A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar)

>
మరిన్ని వార్తలు