మరోసారి తండ్రి కాబోతున్న వార్నర్‌

1 Jan, 2019 16:00 IST|Sakshi

సిడ్నీ : ట్యాంపరింగ్‌ వివాదంతో ఆటకు దూరమై 2018 సంవత్సరమంతా చేదు అనుభవాలు ఎదుర్కొన్న ఆస్ట్రేలియా క్రికెటర్‌ డెవిడ్‌ వార్నర్‌కు నూతన ఏడాది తీపికబురుతో ప్రారంభమైంది. మరో నాలుగు నెలల్లో నిషేధం పూర్తిచేసుకోని అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేయనున్న వార్నర్‌కు అంతకు ముందే శుభవార్త విన్నాడు. తను మరోసారి తండ్రికాబోతున్నట్లు తన భార్య క్యాండిక్‌ వార్నర్‌ నోట వచ్చిన తీపి కబురుతో వార్నర్‌ కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు. ఇక వార్నర్‌ తండ్రికాబోతున్నాడనే విషయాన్ని అతని భార్య క్యాండికే స్వయంగా ట్వీటర్‌లో పేర్కొంది. ‘ఈ ఏడాదంతా మా వెన్నంటి నిలిచిన ప్రతీ ఒక్కరికి తెలియజేసేది ఏమంటే.. 2019లో మా కుటుంబంలోని నలుగురం కాస్త ఐదుగురు కానున్నాం. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తాను గర్భవతిననే విషయాన్ని ట్వీట్‌ చేసింది.

ఇక వార్నర్‌ ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలకు తండ్రన్న విషయం తెలిసిందే. ట్యాంపరింగ్‌ వివాదంతో ఆటకు దూరమైన వార్నర్‌.. మరో నాలుగు నెలల్లో అతనిపై పడ్డ నిషేదం పూర్తికానుంది. ఇక వార్నర్‌ పునరాగమం కోసం ఆసీస్‌ ఆటగాళ్లు, అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు నిషేధం ఎదుర్కొంటున్న స్టీవ్‌ స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌లు ఈ ఘటనకు పూర్తి కారణం వార్నరే అని వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వార్నర్‌ ప్రోద్భలంతోనే బాల్‌ట్యాంపరింగ్‌కు పాల్పడ్డానని బాన్‌క్రాప్ట్‌ పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరి ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు