హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగవద్దు!

13 Jun, 2018 01:12 IST|Sakshi

వివేకానంద్‌కు హైకోర్టు షాక్‌ 

అంబుడ్స్‌మన్‌ తీర్పుపై మళ్లీ విచారణ చేపట్టాలని సింగిల్‌ జడ్జికి ధర్మాసనం స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి.వివేకానంద్‌కు హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా వివేక్‌ కొనసాగడానికి వీల్లేదంటూ అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ నర్సింహా రెడ్డి ఇచ్చిన తీర్పు అమలును నిలిపేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. అంబుడ్స్‌మన్‌ తీర్పుపై తిరిగి విచారణ చేపట్టాలని సింగిల్‌ జడ్జికి సూచించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. హెచ్‌సీఏతో వాణిజ్యపరమైన ఒప్పందం ఉన్న విశాక ఇండస్ట్రీస్‌కు వివేక్‌ డైరెక్టర్‌గా వ్యవహరించడం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని, అందువల్ల ఆయన హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అనర్హుడిగా ప్రకటించాలంటూ అంబుడ్స్‌మన్‌ ముందు భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్, బాబూరావు తదితరులు ఫిర్యాదులు దాఖలు చేశారు.

విచారణ జరిపిన అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ నర్సింహా రెడ్డి ఈ ఏడాది మార్చి 8న తీర్పునిస్తూ... విశాక ఇండస్ట్రీస్‌కు డైరెక్టర్‌గా కొనసాగుతూ, అదే కంపెనీతో ఒప్పందం ఉన్న హెచ్‌సీఏకు అధ్యక్షుడిగా ఉండటం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని తేల్చారు. అందువల్ల హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగడానికి వీల్లేదంటూ పేర్కొన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ వివేక్‌ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి మార్చి 15న అంబుడ్స్‌మన్‌ తీర్పు అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను మళ్లీ సవాలు చేస్తూ అంబుడ్స్‌మన్‌ ముందు ఫిర్యాదుదారులైన అజహరుద్దీన్, బాబూరావులు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి మంగళవారం తీర్పు వెలువరిస్తూ... సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. అంబుడ్స్‌మన్‌ తీర్పుపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారణ జరపాలని సింగిల్‌ జడ్జికి సూచించింది. 

తీర్పును స్వాగతిస్తున్నాం... 
హైకోర్టు ఉత్తర్వులపై పిటిషనర్‌ బాబూరావు సంతోషం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ పనితీరు సక్రమంగా లేకనే బీసీసీఐ నుంచి నిధులు రావడం లేదని... వివేక్‌ వర్గానికి చిత్తశుద్ధి ఉంటే లోధా కమిటీ సిఫారసులను అనుగుణంగా పూర్తి స్థాయి ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్‌ చేశారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్రీడారంగంలోకి ఐశ్వర్య ధనుష్‌

ఆదివారానికి వాయిదా!

సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌గా ట్రెవర్‌ బేలిస్‌

పి.టి. ఉషకు ఐఏఏఎఫ్‌ అవార్డు

క్వార్టర్స్‌లో సింధు శ్రీకాంత్‌ ఓటమి

టైటిల్‌ వేటలో తెలుగు టైటాన్స్‌

యువీ చాలెంజ్‌.. బ్యాట్‌ పట్టిన ధావన్‌

కోహ్లి ఎంట్రీ.. సమావేశం వాయిదా!

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

ధోని భవితవ్యం తేలేది రేపే!

ఇంగ్లండ్‌ కోచ్‌కు సన్‌రైజర్స్‌ బంపర్‌ ఆఫర్‌

ఐసీసీకి కివీస్‌ కోచ్‌ విన్నపం

‘ఛీ.. రజాక్‌ ఇలాంటోడా?’

సూపర్‌ ఓవర్‌ టెన్షన్‌.. ప్రాణాలు వదిలిన కోచ్‌

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

స్టోక్స్‌ ఆ పరుగులు వద్దన్నాడట!

కపిల్‌ త్రయం చేతిలో... హెడ్‌ కోచ్‌ ఎంపిక బాధ్యత!

అబొజర్‌కు తెలుగు టైటాన్స్‌ పగ్గాలు

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ: ఇషా సింగ్‌కు రజతం

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

ప్రపంచకప్‌ ఎఫెక్ట్‌: రాయ్‌ తొలిసారి

యుముంబా కెప్టెన్‌ ఫజల్‌ అట్రాచలీ

పాండే సెంచరీ.. కృనాల్‌ పాంచ్‌ పటాక

‘ఇక ఆడింది చాలు.. వెళ్లిపోండి’

కూతేస్తే.. కేకలే

‘విశ్రాంతి వద్దు.. నేను వెళతాను!’

ఐసీసీ కీలక నిర్ణయం యాషెస్‌ నుంచే అమలు!

కోచ్‌ల కోసం తొందరెందుకు?

స్టోక్స్‌ వద్దన్నా.. అంపైర్లు వింటేగా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!