పాండ్యా.. అది సిగరెటా?​

20 Nov, 2018 09:07 IST|Sakshi

టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోని సతీమణి సాక్షి ధోని జన్మదిన వేడుకలు ముంబైలో ఆదివారం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు హాజరైన భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మిగతా క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న నేపథ్యంలో హాజరుకాలేకపోయారు. అయితే సాక్షి ధోని ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వీడియోలో పాండ్యా తీరు పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలో ఆమె కేక్‌ కట్‌ చేస్తుండగా.. పాండ్యా పొగతాగుతూ కనిపించాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటజన్లు పాండ్యాను ట్రోల్‌ చేస్తూ కామెంట్‌ చేస్తున్నారు. ‘పాండ్యా భాయ్‌ అది నిజంగా సిగరెటేనా’అంటూ ఒకరు కామెంట్‌ చేయగా.. మరికొందరు పాండ్యా సిగరెట్‌ తాగాడంటూ కన్ఫామ్‌ అయి మండిపడుతున్నారు. అయితే ఆ వీడియోలో కనిపిస్తున్నట్లు పాండ్యా నిజంగా సిగరెట్‌ తాగాడా అనే విషయం తెలియాల్సివుంది. దీనిపై పాండ్యా ఇంతవరకు స్పందించలేదు. 

ఆసియా కప్‌లో హార్దిక్‌ పాండ్యా గాయపడటంలో వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాలతో సిరీస్‌లకు దూరమైన విషయం తెలిసిందే. హార్దిక్‌ పాండ్యా గాయపడటంతో తన అన్న కృనాల్‌ పాండ్యాకు టీ20 జట్టులో చోటు దక్కింది. ఇక కీలక ఆసీస్‌ పర్యటనకు హార్దిక్‌ లేకపోవడం తీవ్రమైన లోటేనని టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. అతడు జట్టులో ఉంటే టీమ్‌ బ్యాలెన్స్డ్‌గా ఉండేదని కోచ్‌ వాపోయాడు.  
 

Cake cutting 😍😍 #SakshiDhoni #Msdhoni

A post shared by Sakshi Singh Dhoni FC 🍓 (@_sakshisingh_r) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా