‘వారు క్రికెట్‌ లవర్సే కాదు’

18 Aug, 2019 13:20 IST|Sakshi

సిడ్నీ: బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాది నిషేధం ఎదుర్కొన్న ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌.. యాషెస్‌ సిరీస్‌ ద్వారా తన టెస్టు పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. తొలి టెస్టులో రెండు భారీ సెంచరీలు చేసిన స్మిత్‌.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే స్మిత్‌కు నిరసనల సెగ తప్పడం లేదు. ఆ బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఇంగ్లండ్‌ అభిమానులు పదే పదే ‘చీటర్‌-చీటర్‌’ ఎగతాళి చేస్తూనే ఉన్నారు. స్మిత​ గాయపడి పెవిలియన్‌కు తీసుకెళుతున్న సమయంలో కూడా ఈ తరహా నిరసన సెగలు వినిపించడంపై ఆసీస్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ జాన్సన్‌ స్పందించాడు

క్రికెట్‌ గేమ్‌లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చెడగొట్టడానికి కొంతమంది పూనుకుంటారని, వారే స్మిత్‌ను చీటర్‌ అంటూ ఎగతాళి చేస్తున్నారని అన్నాడు. ఇది చాలా జుగుప్సాకరమైన చర్యగా జాన్సన్‌ పేర్కొన్నాడు. ఎప్పుడో ముగిసిపోయిన కథను మళ్లీ మళ్లీ గుర్తు చేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించాడు. ఇలా ఎవరైతే చేస్తోరో వారు తన దృష్టిలో క్రికెట్‌ లవర్సే కాదని కాస్త ఘాటుగా మాట్లాడాడు.  మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన మొత్తం అభిమానులను ఉద్దేశించి తాను ఇలా అనడం లేదని, ఎవరైతే ఒకర్ని ఏడిపించాలని చేస్తారో వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నానని జాన్సన్‌ అన్నాడు. ఆర్చర్‌ బౌలింగ్‌లో గాయపడి పెవిలియన్‌కు స్మిత్‌ చేరుతున్న క్రమంలో కూడా చీటర్‌ అంటూ ఎగతాళికి దిగడం వినిపించిందని, ఇది తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు.

మరిన్ని వార్తలు