ఆరంభం అదిరింది

19 Jan, 2020 02:25 IST|Sakshi

నెదర్లాండ్స్‌పై భారత్‌ ఘనవిజయం

భువనేశ్వర్‌: ప్రొ హాకీ లీగ్‌ రెండో సీజన్‌లో భారత్‌ అదిరే అరంభం చేసింది. శనివారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 5–2 గోల్స్‌ తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసి టోరీ్నలో శుభారంభం చేసింది. రెండో క్వార్టర్‌ మినహా మిగిలిన క్వార్టర్స్‌లో భారత ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. చక్కటి సమన్వయంతో కదులుతూ ప్రత్యర్థి గోల్‌ పోస్టుపై దాడులు చేశారు. భారత ఆటగాళ్లలో రూపిందర్‌ సింగ్‌ (12వ, 46వ నిమిషంలో) రెండు గోల్స్‌ చేయగా... గుర్జంత్‌ సింగ్‌ (1వ నిమిషంలో), మన్‌దీప్‌ సింగ్‌ (34వ నిమిషంలో), లలిత్‌ ఉపాధ్యాయ్‌ (36వ నిమిషంలో) తలా ఒక గోల్‌ చేశారు. నెదర్లాండ్స్‌ తరఫున జిప్‌ జాన్‌స్సెన్‌ (14వ నిమిషంలో), జెరాన్‌ (28వ నిమిషంలో) చెరో గోల్‌ చేశారు. నేడు ఇదే వేదికపై నెదర్లాండ్స్‌తో భారత్‌ రెండో మ్యాచ్‌ ఆడుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1 ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అదనంగా మరో రూ. 75 లక్షలు... కేంద్రానికి హాకీ ఇండియా విరాళం

థాయ్‌లాండ్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్యపై వేటు

ధోనికి జీవా మేకప్‌

నెమార్‌ విరాళం రూ. 7 కోట్ల 64 లక్షలు

ఇంగ్లండ్‌ క్రికెటర్ల దాతృత్వం

సినిమా

కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్‌

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!

కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ 

జైలు కాదు.... మనందరి మేలు