క్రీడల్లో లింగ వివక్షపై ఐఓఏ ముందడుగు

14 Jul, 2020 00:18 IST|Sakshi

న్యూఢిల్లీ: క్రీడా పరిపాలన వ్యవహారాల్లో లింగ వివక్షను రూపుమాపి, పురుషులతో సమానంగా మహిళలకు సమాన అవకాశాలిచ్చేందుకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ముందడుగు వేసింది. ఈ మేరకు జాతీయ క్రీడా సమాఖ్యల జనరల్‌ అసెంబ్లీలో మూడింట ఒక వంతు మహిళలు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఐఓఏ కార్యదర్శి రాజీవ్‌ మెహతా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ను కోరారు. అన్ని జాతీయ ఒలింపిక్‌ కమిటీలు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలని ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ సూచించింది. 

మరిన్ని వార్తలు