పొవార్‌ చాలు ఇక.. పో?

30 Nov, 2018 20:58 IST|Sakshi

సాక్షి, ముంబై: టీమిండియా మహిళా క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ రమేశ్‌ పొవార్‌ను సాగనంపేందుకు రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. కోచ్‌గా నేటి(శుక్రవారం)కి పొవార్‌ కాంట్రాక్టు పూర్తవనుండటంతో టీమిండియా కోచ్‌ పదవికి దరఖాస్తులు కోరుతూ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ఆహ్వానించింది. అయితే.. మళ్లీ కోచ్ కోసం పొవార్ దరఖాస్తు చేసుకునే వెసులబాటు ఉన్నా..  ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అతడి కాంట్రాక్టును పొడిగించేందుకు బీసీసీఐ అంత సుముఖంగా లేన్నట్లు తెలుస్తోంది. మిథాలీ రాజ్‌ని తప్పిం చడం గురించి టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ ప్రస్తావిస్తూ, విరాట్‌ కోహ్లికి కూడా ఇలాగే చేస్తారా అని ప్రశ్నించడంతో బీసీసీఐ సమాలోచనలో పడినట్టు సమాచారం. (అడుగడుగునా అవమానించారు )

వెస్టిండీస్‌ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీనియర్‌ బ్యాటర్‌ మిథాలీ రాజ్‌ను పక్కకు పెట్టడం వివాదస్పదమైన విషయం తెలిసిందే. మంచి ఫామ్ మీదున్న మిథాలీని తప్పిస్తూ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన, కోచ్‌ రమేష్‌ పొవార్, సెలెక్టర్‌ సుధా షా నిర్ణయం పట్ల అటు ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. (ఇది నా జీవితంలో చీకటి రోజు: మిథాలీ)

ఇక కోచ్‌ తనను అవమానించినట్లు మిథాలీ రాజ్‌ ఆవేదన వ్యక్తం చేయడం, సీనియర్లతో భేదాభిప్రాయాలు, విపరీతమైన ఈగో, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు గెలిచిన జట్టునే కొనసాగించాలని పట్టుబట్టడం వంటి కారణాలు పొవార్‌కు వ్యతిరేకంగా మారాయి. అటు సోషల్‌ మీడియాలో మిథాలీకి పెద్ద ఎత్తున మద్దతు పెరగటం, రమేష్‌ పొవార్‌ను ట్రోల్‌ చేస్తుండటం తెలిసిందే. (మిథాలీ బెదిరించింది: పొవార్‌)

మరిన్ని వార్తలు