ఐపీఎల్‌ సాంగ్‌ - ‘బెస్ట్‌ వర్సెస్‌ బెస్ట్‌’

13 Mar, 2018 09:19 IST|Sakshi

న్యూఢిల్లీ : ఐపీఎల్‌ 2018 ఆరంభానికి ముందే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీసీసీఐ, స్టార్‌ ఇండియా సంయుక్తంగా ‘బెస్ట్‌ వర్సెస్‌ బెస్ట్‌’ పేరుతో ఐపీఎల్‌ ప్రచార గీతాన్ని నిన్న(సోమవారం సాయంత్రం) విడుదల చేశాయి. దక్షిణాఫ్రికా ఫిల్మ్‌ డైరెక్టర్‌ డాన్‌ మాస్‌ , సంగీత దర్శకుడు రాజీవ్‌ వీ బల్లా, సింగర్‌ సిదార్థ్‌ బస్రూర్‌ ఈ గీతానికి పని చేశారు. హిందీతో పాటు, తెలుగు, తమిళ్‌, బెంగాలీ, కన్నడ భాషల్లో ఈ గీతాన్ని రూపొందించారు. సాంగ్‌ విడుదలైన కొద్దిసేపటికే మహేంద్రసింగ్‌ ధోని ట్వీటర్‌ ద్వారా స్పందించారు. ఐపీఎల్‌ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, దానికి జోష్‌ తెచ్చేలా ప్రచారం ఉందన్నారు. ఏప్రిల్‌ 7న ప్రారంభం కానున్న ఐపీఎల్‌ మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి.

మరిన్ని వార్తలు