ఎస్‌బీఐ కస్టమర్లకు మరింత దగ్గర కానున్న ఎంఎస్‌ ధోనీ!

29 Oct, 2023 15:53 IST|Sakshi

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)తో చేతులు కలిపింది. మిస్టర్‌ కూల్‌ను తమ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు ప్రకటించింది. ఎస్‌బీఐ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని వివిధ మార్కెటింగ్, ప్రమోషనల్ క్యాంపెయిన్‌లలో కీలక పాత్ర పోషిస్తారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

 

ఒత్తిడితో కూడిన పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉంటూ స్పష్టమైన ఆలోచన, వేగంగా నిర్ణయం తీసుకోవడంలో ఎంఎస్‌ ధోనీ ప్రసిద్ధి చెందారు. ఆయనతో భాగస్వామ్యం దేశవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్‌లు, వాటాదారులతో మరింత కనెక్ట్ అవ్వడానికి ఉపకరిస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది.

"సంతృప్త కస్టమర్‌గా ఎస్‌బీఐతో ధోని అనుబంధం ఆయన్ను మా బ్రాండ్ నైతికతకు పరిపూర్ణ స్వరూపంగా చేస్తుంది. ఈ భాగస్వామ్యంతో, విశ్వాసం, సమగ్రత, అచంచలమైన అంకితభావంతో దేశానికి, కస్టమర్‌లకు సేవ చేయాలనే మా నిబద్ధతను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు