‘నువ్వు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు’

16 Sep, 2019 18:36 IST|Sakshi

లండన్‌: ఐపీఎల్‌-12, ప్రపంచకప్‌-2019 హీరో డేవిడ్‌ వార్నర్‌ తాజాగా ముగిసిన యాషెస్‌ సిరీస్‌లో అట్టర్‌ ఫ్లాఫ్‌ అయ్యాడు. పది యాషెస్‌ ఇన్నింగ్స్‌ల్లో కేవలం 95 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. వార్నర్‌ చెత్త ప్రదర్శన ఆసీస్‌పై తీవ్ర ప్రభావం చూపింది. యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ బ్యాటింగ్‌కు వెన్నుముకగా వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌లను భావించారు. అయితే స్మిత్‌ ఒంటరి పోరాటంతో ఆకట్టుకోగా.. వార్నర్‌ పేలవ ఫామ్‌తో ఆసీస్‌ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే వార్నర్‌ చెత్త ప్రదర్శనపై ఫ్యాన్స్‌తో సహా ఆసీస్‌ మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు. అయితే వార్నర్‌ను ఆ జట్టు ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ వెనకేసుకొచ్చాడు. 

‘వార్నర్‌కు ఈ సిరీస్‌ కష్టతరంగా గడిచింది. అతడు చెత్త ప్రదర్శన చేసినప్పటికీ వార్నర్‌ ఎల్లప్పుడూ చాంపియన్‌ ప్లేయరే. తిరిగి ఫామ్‌ అందుకుంటాడని ఆశిస్తున్నా. చాంపియన్‌ ప్లేయర్స్‌ కూడా కొన్ని సార్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటారు. అంతమాత్రానా ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’అంటూ లాంగర్‌ వివరించాడు. నిర్ణయాత్మకమైన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించడంతో ఆసీస్‌కు నిరాశ తప్పలేదు. దీంతో ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌ 2-2తో డ్రాగా ముగిసింది. అయితే గత యాషెస్‌ సిరీస్‌ను ఆసీస్‌ కైవసం చేసుకోవడంతో తిరిగి టైటిల్‌ను నిలబెట్టుకుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు