కేయూర, ప్రాషి జోషి శుభారంభం

14 Jun, 2019 13:54 IST|Sakshi

ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారులు కేయూర మోపాటి, ప్రాషి జోషి శుభారంభం చేశారు. విజయవాడలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో కేయూర 21–19, 20–22, 21–17తో క్వాలిఫయర్‌ కె. వైష్ణవి (తెలంగాణ)పై పోరాడి గెలవగా... మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్‌ ప్రాషి జోషి 21–10, 21–14తో అనురియా దాస్‌ (పశ్చిమ బెంగాల్‌)ను అలవోకగా ఓడించి ముందంజ వేసింది. ఇతర మ్యాచ్‌ల్లో నిషితా వర్మ (ఆంధ్రప్రదేశ్‌) 21–17, 21–15తో నిషిత డేంబ్లా (హరియాణా)పై గెలుపొందగా... సూర్య చరిష్మా (ఆంధ్రప్రదేశ్‌) 18–21, 21–18, 11–21తో ఆద్య వరియత్‌ (కేరళ) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో తొమ్మిదో సీడ్‌ డి. జశ్వంత్‌ (ఆంధ్రప్రదేశ్‌) ముందంజ వేశాడు.

జశ్వంత్‌ 21–19, 21–8తో సిద్దేశ్‌ హుడేకర్‌ (మహారాష్ట్ర)ను ఓడించి రెండోరౌండ్‌లో అడుగుపెట్టాడు. ఇతర మ్యాచ్‌ల్లో విజేత (తెలంగాణ) 11–21, 8–14తో రిటైర్డ్‌హర్ట్‌గా శంకర్‌ ముత్తుస్వామి (తమిళనాడు) చేతిలో ఓడిపోయాడు. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌ నవనీత్‌–సాహితి జోడీకి తొలిరౌండ్‌లోనే పరాజయం ఎదురైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలిరౌండ్‌లో అర్జున్‌ (కేరళ)–మనీషా (ఆర్‌బీఐ) ద్వయం 22–20, 22–20తో నవనీత్‌–సాహితి జంటపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్‌ శ్రీకృష్ణ సాయికుమార్‌ (తెలంగాణ)–కావ్య గాంధీ (ఢిల్లీ) జంట 21–15, 15–21, 21–13తో రెండో సీడ్‌ ఉత్కర్‌‡్ష అరోరా (ఢిల్లీ)–కరిష్మా వాడ్కర్‌ (మహారాష్ట్ర) జోడీపై, గౌస్‌ షేక్‌ (ఆంధ్రప్రదేశ్‌)–మమూరి యాదవ్‌ (గుజరాత్‌) జంట 21–19, 17–21, 21–13తో హిమాన్షు సరోహా–అనురియా దాస్‌ (పశ్చిమ బెంగాల్‌) జంటపై నెగ్గి రెండోరౌండ్‌కు చేరుకున్నాయి.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యువీ చాలెంజ్‌.. బ్యాట్‌ పట్టిన ధావన్‌

కోహ్లి ఎంట్రీ.. సమావేశం వాయిదా!

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

ధోని భవితవ్యం తేలేది రేపే!

ఇంగ్లండ్‌ కోచ్‌కు సన్‌రైజర్స్‌ బంపర్‌ ఆఫర్‌

ఐసీసీకి కివీస్‌ కోచ్‌ విన్నపం

‘ఛీ.. రజాక్‌ ఇలాంటోడా?’

సూపర్‌ ఓవర్‌ టెన్షన్‌.. ప్రాణాలు వదిలిన కోచ్‌

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

స్టోక్స్‌ ఆ పరుగులు వద్దన్నాడట!

కపిల్‌ త్రయం చేతిలో... హెడ్‌ కోచ్‌ ఎంపిక బాధ్యత!

అబొజర్‌కు తెలుగు టైటాన్స్‌ పగ్గాలు

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ: ఇషా సింగ్‌కు రజతం

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

ప్రపంచకప్‌ ఎఫెక్ట్‌: రాయ్‌ తొలిసారి

యుముంబా కెప్టెన్‌ ఫజల్‌ అట్రాచలీ

పాండే సెంచరీ.. కృనాల్‌ పాంచ్‌ పటాక

‘ఇక ఆడింది చాలు.. వెళ్లిపోండి’

కూతేస్తే.. కేకలే

‘విశ్రాంతి వద్దు.. నేను వెళతాను!’

ఐసీసీ కీలక నిర్ణయం యాషెస్‌ నుంచే అమలు!

కోచ్‌ల కోసం తొందరెందుకు?

స్టోక్స్‌ వద్దన్నా.. అంపైర్లు వింటేగా

పంత్‌ కోసం ధోనీ చేయబోతుందిదే!

‘బౌండరీ’కి బదులు రెండో సూపర్‌

విలియమ్సన్‌పై రవిశాస్త్రి ప్రశంసలు

ఆ ‘స్పెషల్‌’ జాబితాలో రోహిత్‌శర్మ

ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!

గాయం బెడద భయం గొల్పుతోంది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

మూడోసారి తండ్రి అయిన హీరో!

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..